• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీహార్ లోనూ మహారాష్ట్ర...

బీహార్ లోనూ మహారాష్ట్ర ఫార్ములా...నితీష్ ఏం చేస్తారో ?

| 2020 అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా పోటీ చేసి గెలిచింది

By - Tupaki Desk
Update: 2024-12-24 04:01 GMT

బీహార్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. 2025 అక్టోబర్ లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అయిదేళ్ళ పాటు సీఎం గా ఉన్న నితీష్ కుమార్ మళ్లీ ప్రజా తీర్పు కోరబోతున్నారు. 2020 అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా పోటీ చేసి గెలిచింది. నితీష్ కుమార్ జేడీయూ అందులో కీలక భాగస్వామిగా ఉంది. అయితే బీజేపీకి 78 సీట్లు వస్తే నితీష్ కుమార్ కి 45 దాకా వచ్చాయి. దాంతో నితీష్ ని ముఖ్యమంత్రిగా చేస్తారా అని ఆనాడే చర్చ సాగింది. కానీ ఎట్టకేలకు బీజేపీ డెసిషన్ తీసుకుంది. అలా నితీష్ కుమార్ సీఎం అయ్యారు.

అయితే మధ్యలో పొరపొచ్చాలు రావడంతో ఆయన ఇండియా కూటమి వైపు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ సీఎం గా ఉన్నారు. మళ్ళీ ఏణ్ణర్ధం క్రితం ఎన్డీయే వైపు వచ్చారు. ఇక కేవలం పది నెలల సమయం సార్వత్రిక ఎన్నికలకు ఉండగా బీహార్ రాజకీయం హీటెక్కుతోంది. నితీష్ కుమార్ ని ఈసారి సీఎంగా కంటిన్యూ చేస్తారా లేదా అన్న చర్చకు తెర లేస్తోంది.

ఎందుకంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బీజేపీ అగ్ర నేత, హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిని మేము నిర్ణయిస్తామని చెప్పడంలోని అర్ధాలను అంతా వెతుకుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ఫలానా వారు లేకుండానే ఎన్నికలకు వెళ్లాయని బీజేపీ నిర్ణయించిందా అన్నది కూడా చర్చకు వస్తోంది.

అయితే ఆ రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం నితీష్ కుమార్ ప్రధాని మోడీ నాయకత్వంలో బీహార్ ఎన్నికలకు వెళ్ళి గెలిచి వస్తామని చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ దీని మీద మాట్లాడుతూ నితీష్ కుమార్ కి మద్దతుగా కూటమి ఉంటుందని చెప్పారు.

అదే విధంగా హర్యానాలోని సూరజ్ కుండ్ లో ఇటీవల జరిగిన బీజేపీ సమావేశంలో కూడా బీహార్ ఎన్నికలలో నితీష్ కుమార్ నాయకత్వమే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయినా కానీ అమిత్ షా లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్స్ చూస్తే ముఖ్యమంత్రి విషయంలో ఈసారి బీజేపీ పట్టుదలగా ఉంటుందని అంటున్నారు.

అంతే కాదు ఏ మాత్రం వెనక్కి తగ్గదని చెబుతున్నారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న బీహార్ లో ఈసారి బీజేపీ నుంచి సీఎం కావాలన్నది బీజేపీ పెద్దల సంకల్పం అని చెబుతున్నారు. బీహార్ లో కూడా మహారాష్ట్ర ఫార్ములాను ఉపయోగిస్తారు అని అంటున్నారు

మరి నితీష్ కుమార్ ఏమి చేస్తారు అంటే ఆయనను కేంద్రంలో కీలక శాఖలకు మంత్రిగా తీసుకుంటారు అని అంటున్నారు. అయితే బీహార్ లో ఏకచత్రాధిపత్యం గా అధికారాన్ని అనుభవిస్తున్న నితీష్ కుమార్ కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు చేపడతారా అన్నది కూడా చూడాలి. పైగా ఎన్డీయే ప్రభుత్వానికి జేడీయూ కీలక మద్దతు ఇస్తోంది. ఆ మద్దతు కనుక లేకపోతే ఇబ్బందులో పడుతుంది. ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్న క్రమంలో నితీష్ కుమార్ తన రాజకీయ చతురతను వ్యూహాలను బయటకు తీయకుండా ఉంటారా అన్నదే చర్చగా ఉంది.

Tags:    
  • Congressparty 
  • Bjp 
  • Biharelections 
  • Biharpolitics 
  • BjpPresident 
  • Nitishkumar 
  • JDU 
  • Amitshah 
  • NarendraModi 
  • PM 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS