సుదీర్ఘ కాలం తరువాత పోటీకి డిగ్గీ రాజా రెడీ?

పార్లమెంట్ ఎన్నికల్లో ఇన్నాళ్లకు పోటీకి సై అని అంటున్నారు.

Update: 2024-05-07 10:05 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా కూడా పనిచేశారు. అప్పుడు అందరు ఆయన్ను డిగ్గీ రాజా అని పిలిచేవారు. కాంగ్రెస్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు ఉంది. సుమారు 30 ఏళ్ల విరామం తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఆయన పోటీలో నిలిచారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇన్నాళ్లకు పోటీకి సై అని అంటున్నారు.

చివరిగా 1991లో రాజ్ గఢ్ లోక్ స్థానం నుంచి విజయం సాధించారు. ఇన్ని సంవత్సరాలకు మళ్లీ అదే స్థానం నుంచి పోటీలో నిలవడం గమనార్హం. ఆయన ప్రత్యర్థి రోడ్మల్ నగర్ డిగ్గీని ఢీకొడుతున్నారు. గత రెండు సార్లు ఇక్కడ నుంచి బీజేపీ తరఫున ఆయన విజయం సాధించడం విశేషం. 2019లో 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన నాగర్ ను డిగ్గీరాజా ఎదుర్కొంటున్నారు.

డిగ్గీరాజాకు కాంగ్రెస్ లో మంచి పేరుంది. వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న సమయంలో కూడా ఆయన చాతుర్యంతో కాంగ్రెస్ కు మంచి పట్టు తీసుకొచ్చారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి పోటీలో నిలిచిన డిగ్గీరాజా విజయం సాధిస్తారని అనుకుంటున్నారు. కానీ బీజేపీ అభ్యర్థి కూడా బలంగా ఉండటంతో ఏం జరుగుతుందో తెలియడం లేదు.

ప్రస్తుతం దేశమంతా సార్వత్రిక ఎన్నికల సంరంభంలోనే ఉంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు తెలుస్తాయి. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ రెండు పోరాడుతున్నాయి. సర్వేలు మాత్రం బీజేపీనే మూడోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నాయి. కాంగ్రెస్ కూడా తన వంతు పాత్ర పోషించాలని భావిస్తోంది.

ఈనేపథ్యంలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గెలుపు మాదంటే మాదే అనే ధోరణిలో ముందుకు వెళ్తున్నాయి. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని మోదీ సేన ఉవ్విళ్లూరుతోంది. బీజేపీ ప్రవాహానికి కట్టలు వేయాలని కాంగ్రెస్ తలపిస్తోంది. కానీ కాంగ్రెస్ కు అంత బలం లేనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ కు పాలించే సత్తా లేదనే ఉద్దేశం ప్రజల్లో నాటుకుపోవడం గమనార్హం.

Tags:    

Similar News