• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'కొత్త దలైలామా..' చైనా...

'కొత్త దలైలామా..' చైనా మాట చెల్లకుంటే ప్రపంచంలో రగడే

| బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా. టిబెట్ ప్రజల ఆరాధ్య దైవం. అలాంటి దలైలామా దాదాపు 70 ఏళ్లుగా భారత్ లోనే ఉంటున్నారు.

By - Tupaki Desk
Update: 2025-07-02 16:30 GMT

బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా. టిబెట్ ప్రజల ఆరాధ్య దైవం. అలాంటి దలైలామా దాదాపు 70 ఏళ్లుగా భారత్ లోనే ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలను తన స్థావరంగా చేసుకున్నారు.

భారత్-చైనా మధ్య 1960ల ప్రారంభంలో యుద్ధానికి మూల కారణం దలైలామా అంశమే. చైనా నిర్బంధాన్ని ఎదిరించి దలైలామా తన శిష్యులతో భారత్ కు రావడం.. ఆయనను అప్పగించాలని డ్రాగన్ కోరినా తిరస్కరించడం చివరకు చైనా మన మీద యుద్ధానికి దిగడం అంతా చరిత్రే.

మళ్లీ ఇప్పుడు దలైలామా వ్యవహారం దుమారం రేపుతోంది. ప్రస్తుత దలైలామాకు 90 ఏళ్లు. దీంతో కొత్త దలైలామాను ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. అయితే, ఇందులో చైనా ప్రమేయం ఏమాత్రం ఉండదని ప్రస్తుత దలైలామా ప్రకటించడం వివాదానికి దారితీసింది.

తన తదనంతరమూ దలైలామా సంప్రదాయం కొనసాగుతుందని, అది కూడా చైనా చెప్పినట్లు కాదని దలైలామా తేల్చిచెప్పిన గంటల్లోనే.. చైనా స్పందించింది. కొత్త దలైలామా ఎంపిక తమకు చెప్పే జరగాలని ప్రకటించింది.

దలైలామా 600 ఏళ్లుగా కొనసాగుతున్న బౌద్ధ సంప్రదాయం. ప్రస్తుత ఆధ్యాత్మిక నేత 70 ఏళ్లకుపైగా కొనసాగుతున్నారు. కొత్త నాయకుడి ఎన్నిక చేపట్టాల్సిన నేపథ్యంలో ఈ బాధ్యతను గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ కు అప్పగించారు దలైలామా. దీనిని దలైలామానే 2011లో స్థాపించారు. కొత్త దలైలామా గుర్తింపును ఈ సంస్థే చేపడుతుందని దలైలామా తాజాగా ప్రకటించారు. తన వారసత్వం కొనసాగాలని టిబెట్, మంగోలియా, రష్యా, చైనాలోని మద్దతుదారుల నుంచి అభ్యర్థనలు వస్తున్నట్లు తెలిపారు.

కాగా, టిబెట్ ఒకప్పడు స్వతంత్ర రాజ్యం. చైనా కాలక్రమంలో దాన్ని కలిపేసుకుంది. ఆ దేశ ప్రభుత్వం గోల్డెన్ అర్న్ అనే పద్ధతిలో తమ అనుకూల వ్యక్తిని దలైలామా చేయాలని చూస్తోంది. దీన్ని ప్రస్తుత దలైలామా ఖండిస్తున్నారు. అసలు ధర్మాన్నే నమ్మని కమ్యూనిస్టులు.. పునర్జన్మల మీద ఆధారపడిన తవ వ్యవస్థలో జోక్యం చేసుకోవడాన్ని ఖండిస్తున్నారు.

ఈ నెల 6న దలైలామా 90వ పుట్టిన రోజు. సరిగ్గా దీనికి నాలుగు రోజుల ముందు కొత్త వారసుడి ఎంపిక రగడ రేగింది. ప్రస్తుత ఆధ్యాత్మిక నేత పేరు టెన్జిన్ గ్యాట్సో. ఈయన 14వ దలైలామా. 1935లో టిబెట్ టాక్సేర్ గ్రామంలో పుట్టగా.. 1940లో దలైలామాగా గుర్తించారు. 1950లో టిబెట్ ను చైనా ఆక్రమించగా.. 1959లో టిబెట్ ప్రజలు తిరుగుబాటు చేశారు. దలైలామాను వేర్పాటువాదిగా చైనా ముద్ర వేసింది. అనంతర పరిణామాల్లో ఆయన తన శిష్యులతో భారత్ లోకి వచ్చేశారు. ఇక దలైలామా ఎంపికలో చైనా ప్రమేయాన్ని అమెరికా కూడా వ్యతిరేకిస్తోంది. ఇది చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

Tags:    
  • DalaiLama 
  • NextDalaiLama 
  • Tibet 
  • ChinaTibet 
  • ReligiousFreedom 
  • SpiritualSovereignty 
  • GadenPhodrang 
  • StopChinaInterference 
  • TibetMatters 
  • DalaiLama90 

Similar News

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Copyright @2026

Powered by Blink CMS