• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీలో టాటా పెట్టుబడుల...

ఏపీలో టాటా పెట్టుబడుల వర్షం... కీలక విషయాలు వెల్లడించిన బాబు!

| ఇప్పటికే విశాఖలో టీసీఎస్ గురించి మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ సమయంలో చంద్రబాబు ఎక్స్ వేదికగా మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

By - Tupaki Desk
Update: 2024-11-12 06:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ పెట్టుబడులకు మార్గాలు సుగమం అవుతున్నాయని.. ఈ సమయంలో రాష్ట్రాభివృద్ధిలో టాటా గ్రూపు ఒక ముఖ్యమైన వాటాదారుగా కొనసాగుతోందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విశాఖలో టీసీఎస్ గురించి మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ సమయంలో చంద్రబాబు ఎక్స్ వేదికగా మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

అవును... ఇటీవల ఏపీలో యువతకు గుడ్ న్యూస్ వినిపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో భేటీ అనంతరం.. ఏపీలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. ఇదే సమయంలో 100 రోజుల్లోనే విశాఖలో టీసీఎస్ క్యాంపస్ కు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు.

మరోపక్క తాజాగా సోమవారం నటరాజన్ చంద్రశేఖరన్ తో చర్చించిన చంద్రబాబు... మరిన్ని శుభవార్తలను ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా... పర్యాటక, పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో మరో 20 హోటళ్లను ఏఋపాటు చేయాలని టాటా సంస్థలకు చెందిన ఇండియన్స్ హోటల్స్ భావిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

ఈ సందర్భంగా వివరాలు వెల్లడించిన చంద్రబాబు... చంద్రశేఖరన్ తో జరిగిన సమావేశంలో కీలక రంగాల గురించి చర్చించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ కట్టుబడి ఉందని.. సుమారు 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పినట్లు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల గురించి వెల్లడించారు.

వీటితో పాటు టాటా పవర్ 5వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రూ.40 వేల కోట్లు పెట్టుబడులు పెడుతోందని.. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ లను వినియోగించి పరిష్కారాలను కనుగొనే విషయంలొ సహకారం అందించడంపైనా చర్చించినట్లు తెలిపారు.

Met with the Executive Chairman of @TataCompanies, Mr. N. Chandrasekaran, in Amaravati today. We reflected on the remarkable legacy of Mr Ratan Tata, whose visionary leadership and contribution have left an indelible mark on India's industry landscape. He made immense… pic.twitter.com/2RnwndF0LY

— N Chandrababu Naidu (@ncbn) November 11, 2024
Tags:    
  • Chandrasekaran 
  • Chandrababu 
  • Tatagroups 
  • TataCompanies 
  • Apgovernment 
  • Kutami 
  • TDP 
  • Tatapower 
  • TATA 
  • GoAP 
  • Itdevelopmentcenter 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS