• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  థాంక్స్ టూ బాబు...

థాంక్స్ టూ బాబు అనాల్సిందేనా ?

| నేచురల్ గా చూస్తే రాజకీయాల్లో ఎపుడూ వారూ వీరి మధ్యనే ఆట సాగుతుంది. అధికార ప్రతిపక్షల మధ్య సమరం అన్నది సాగుతూనే ఉంటుంది.

By - Tupaki Desk
Update: 2024-11-12 09:30 GMT

చేతి నిండా పని వైసీపీ నేతలకు కూటమి పెద్దలు చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి చెంది నిరాశ నీడలోకి వెళ్ళిపోయిన వారిలో కొత్త పౌరుషం రగిలిస్తున్నారు. ఇక్కడితో ఆట అయిపోలేదు బస్తీమే సవాల్ అని అంటున్నారు. నేచురల్ గా చూస్తే రాజకీయాల్లో ఎపుడూ వారూ వీరి మధ్యనే ఆట సాగుతుంది. అధికార ప్రతిపక్షల మధ్య సమరం అన్నది సాగుతూనే ఉంటుంది.

ఈ రెండు వైపులా చూస్తే పరస్పర ప్రేరితం గానే వ్యవహారం ఉంటుంది. ఏపీలో వైసీపీ కునారిల్లి దశ దిశ లేని పరిస్థితుల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే వచ్చిన పదకొండు అసెంబ్లీ సీట్లతో ప్రతిపక్ష హోదా మిస్ అయి అయోమయంలో పడిపోయింది.

కానీ వైసీపీ అధినేత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా అడుగుతూంటే కూటమి పెద్దలు మాత్రం ఏకంగా ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీకి అసలు సిసలు ప్రతిపక్ష హోదానే ఇస్తున్నారు. వారు వైసీపీని గత అయిదు నెలలలో టార్గెట్ చేసిన తీరు గతంలో వైసీపీని గుర్తుకు తెస్తోంది.

వైసీపీ సైతం తనకు లభించిన 151 సీట్ల అద్భుతమైన మెజారిటీతో పాలన సవ్యంగా చేయకుండా టీడీపీని అణచడానికి చూసింది. జనసేనను నిర్బంధించడానికి ఎక్కువ ఆలోచించింది. చివరికి ఏమైంది, ఆ రెండు పార్టీలు బలంగా నిలిచి పోరాడాయి. ఎన్నికల వేళలో చేతులు కలిపాయి. భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చాయి.

ఇదంతా కళ్ల ముందు ఉన్న చరిత్రే. ప్రత్యర్థిని ఎంత టార్గెట్ చేస్తే అంతగా ఎదుగుతారు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఆనాడు టీడీపీని లేకుండా చేస్తామని వైసీపీ గట్టి పట్టుదలకు పోయినా ఫలితం నిల్. ఈనాడు వైసీపీ ఆనవాళ్లు లేకుండా చేయాలని కూటమి పెద్దలు ఆలోచించినా అదే జరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ అంతా మరచిపోతున్నది ఏంటి అంటే జనాలను.

జనాలు ఎపుడూ ప్రతిపక్షం వైపు ఉంటారు. వారు అధికారం అప్పగించేంతవరకే మద్దతు ఇస్తారు. ఆ మరుక్షణం వారే సైలెంట్ స్పెక్టేటర్లుగా మారి అంతా గమనిస్తారు. వారికి ఎలాంటి వివక్ష ఉండదు, తీర్పు కఠినంగానే ఎపుడూ ఉంటుంది.

అదే సమయంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఎపుడూ అన్నీ చేయలేదు, ఒకవేళ ఎంత చేసినా ఇంకా కావాలన్నదే జనం నైజం. సో ఆ విధంగా ప్రజలలో భావన బలపడుతూ ఉంటుంది. అరవై నెలల అధికారంలో ప్రతీ నెలకూ ఇంతా ఇంతా వంతున అసంతృప్తి పెరుగుతూనే ఉంటుంది. మరి ఆ అసంతృప్తికి ఒక కేంద్ర బిందువు కావాలి కదా. అది ప్రతిపక్షంలో బలమైన పార్టీ వైపుగా చూసుకుంటుంది.

సో ఆ విధంగా చూస్తే రాజకీయాల్లో ఇది ఒక అందమైన ఆట. అందువల్ల బలమైన పక్షాలను ఎపుడూ ఎదుటి పక్షాలు తాత్కాలికంగా ఇబ్బందులు పెడతాయి తప్ప ఏమీ చేయలేవు అన్నది విశ్లేషణగా ఉంది. ఇక వైసీపీ తీరు చూస్తే 40 శాతం ఓటింగ్ షేర్ తెచ్చుకుని కూడా దిగాలుగా ఉంది. అటువంటి చోట తట్టి లేపుతోంది కూటమి సర్కార్.

సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెద్ద ఎత్తున కట్టడం ఇందులో భాగమే అనుకోవాలని అంటున్నారు. గతంలో ఎపుడో ఏదో చేశారని పాత కేసులను తిరగదోడి వారిని సైతం యాక్టివ్ చేయడం ఎవరి కోసం అన్న చర్చ అయితే ఉంది. అలా కాకుండా నిజంగా అనుచిత అసభ్యకరమైన వ్యాఖ్యలను ఫుల్ స్టాప్ పెట్టాలీ అనుకుంటే ఒక చట్టం చేసి ఇక మీదట ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారి మీద కేసులు పెడతామని చెబితే అది అర్ధవంతం గా ఉంటుంది.

అపుడూ వారూ వీరూ కూడా దారికి వస్తారు. అలా కాకుండా తమ వైపు ఉన్న వారు అంతా సుద్ద పూసలని అవతల వైపున ఉన్న వారే అన్నీ చేశారని భావిస్తూ ఏకపక్షంగా కేసులు పెడితే అది చివరికి ఇబ్బంది అవుతుంది. అయినా కూడా ఇపుడు ఇవి అవసరమా అన్న చర్చ సైతం ఉంది.

ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి రాజకీయ కక్ష కావేశాలకు ఈ విధంగా విలువైన టైం వెచ్చిస్తే చివరికి అది ప్రభుత్వంలో ఉన్న వారికే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. మరో వైపు చూస్తే నిద్రావస్థలో నిండా మునిగిన ప్రతిపక్ష పార్టీని తట్టి లేపి యాక్టివేట్ చేయడం కూడా జరుగుతుందని అంటున్నారు. మొత్తం మీద ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా జనాలు మాత్రం ఎపుడూ క్లారిటీగా ఉంటారు. కాబట్టి అటు అధికార పక్షం అయినా ఇటు ప్రతిపక్షం అయినా పాలన మీద ప్రజా సమస్యల మీద ఫోకస్ పెడితేనే మేలు అని అంటున్నారు

Tags:    
  • Chandrababu 
  • Apgovernment 
  • Appolitics 
  • Pawankalyan 
  • Kutami 
  • Janasena 
  • Apchiefminister 
  • YSRCP 
  • Jagan 
  • Chandrababunaidu 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS