ఏపీకి దూరంగా మూడు రోజులు చంద్రబాబు

ప్రతీ రోజులో వచ్చే ఇరవై నాలుగు గంటలను నూరు శాతం పని కోసం వాడుకునే ఏకైక నాయకుడు బహుశా దేశంలో కాదు ప్రపంచంలోనే చంద్రబాబు ఒక్కరే అంటే అతిశయోక్తి లేదు.

Update: 2026-09-25 17:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఆలోచిస్తే ఆయన నిరంతరం జనంతోనే కనిపిస్తారు. ఆయన రోజు మొత్తంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన తీరిక లేని విధంగా పరిశ్రమిస్తారు. ఇక సమీక్షలు సచివాలయంలో జరిపితే ప్రతీ రోజూ అనేక విభాగాలలో గంటల తరబడి గడుపుతారు. ఒకే రోజు ఉత్తర భారతంలో కార్యక్రమం చూసుకుని తిరిగి ఏపీకి వచ్చి ఏ మాత్రం అలసట చూపించకుండా అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం బాబుకే చెల్లింది. ఆయనను చూసినపుడు 76 ఏళ్ళ వయసు అని ఎవరూ అనుకోరు, ఆయనకు అసలు విశ్రాంతి ఉందా అని మాత్రమే ఆలోచిస్తారు. ప్రతీ రోజులో వచ్చే ఇరవై నాలుగు గంటలను నూరు శాతం పని కోసం వాడుకునే ఏకైక నాయకుడు బహుశా దేశంలో కాదు ప్రపంచంలోనే చంద్రబాబు ఒక్కరే అంటే అతిశయోక్తి లేదు.

విశ్రాంతి అంటేనే :

ఇక బాబుకు విశ్రాంతికి మధ్య ఎంతో అంతరం ఉంది. చంద్రబాబు రెస్ట్ మోడ్ లో ఉంటారు అంటే అది అతి పెద్ద సంచలనం అవుతుంది. అయితే ఎంత బిజీగా ఉండే చంద్రబాబు అయినా ఎపుడో ఒకసారి కుటుంబంతో గడపాలని అనుకుంటారు. అందుకే ఆయన ఈసారి విదేశీ పర్యటన పెట్టుకున్నారు. అది కూడా కేవలం మూడు రోజులు మాత్రమే. చంద్రబాబు విదేశీ పర్యటన ఈ నెల 25న మొదలైంది. ఆయన శుక్రవారం బయలుదేరి వెళ్ళారు. ఆయన మూడు రోజుల పాటు తన ఫ్యామిలీతో అక్కడ గడిపి తిరిగి ఈ నెల 29 నాటికి ఏపీకి చేరుకుంటారు అని భోగట్టా. ఇక బాబు పర్యటన పూర్తిగా వ్యక్తిగతం అయింది. అందువల్ల చంద్రబాబు ఏ దేశం వెళ్తున్నారు అన్న వివరాలు అయితే అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచింది.

పూర్తి ప్రైవేట్ టూర్ :

ఇక బాబు పర్యటన ఎలాంటి అధికారిక ప్రోటోకాల్ లేకుండా సాగనుంది. ఆయన వెంట ప్రభుత్వ ప్రతినిధి బృందాలు వెళ్ళడం లేదు, కేవలం ఆయన వ్యక్తిగత సిబ్బంది మాత్రమే ఉంటారు. వారి పర్యవేక్షణలోనే మొత్తం టూర్ సాగనుంది అని చెబుతున్నారు. చంద్రబాబు మొత్తం బిజీ లైఫ్ గడుపుతున్నారు. దాంతో ఆయన కుటుంబానికి సమయం కేటాయించలేక పోతున్నారు. దీని కోసమే ఈ ప్రైవేట్ టూర్ అని అంటున్నారు. ఇక బాబు ఈ పర్యటన కూడా కేవలం మూడు రోజులలోనే ముగించాలని షెడ్యూల్ చేసుకోవడం విశేషం.

బాబు లేకుండానే :

ఇక ఏపీలో పాలన అధికారిక కార్యక్రమాలు బాబు లేకుండా ఎలా జరుగుతాయి అంటే ఆయన ఎక్కడికి వెళ్లినా ఏపీ మీద ఫోకస్ పెడతారు. అందువల్ల ఇబ్బంది ఏమీ లేదని అంటున్నారు. అంతే కాదు ప్రస్తుతం ఉన్న ఆధునిక సాంకేతిక వ్యవస్థ ఆధారంగా ఆయన ఏ దేశంలో ఉన్నా అత్యవసర సందర్భాలలో ఆదేశాలు ఇవ్వగలరు అని అంటున్నారు. మొత్తానికి బాబు చాలా కాలానికి కుటుంబంతో సహా విదేశీ టూర్ అయితే చేస్తున్నారు. అదన్న మాట మ్యాటర్.

Tags:    

Similar News