• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఓట్లు, సీట్లలో ఎవరి సత్తా...

ఓట్లు, సీట్లలో ఎవరి సత్తా ఎంత..? స్థానికంపై సీఎం చంద్రబాబు ఆకట్టుకునే విశ్లేషణ

| స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి 58.9 శాతం ఓట్లు వచ్చాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం ఓట్లు పెరిగాయని తెలిపారు. వైసీపీ ఓటు షేర్ 39.81 నుంచి 33.56 శాతానికి తగ్గిందని, 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యం సాధించిందని వివరించారు.

By - Tupaki Desk
Update: 2026-11-09 09:10 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికలతో పోలిస్తే కూటమికి 3.6 శాతం ఓట్లు పెరిగాయని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 55.3 శాతం ఓట్లు రాగా, రెండు విడతల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మొత్తంగా 58.9 శాతం ఓట్లు సాధించినట్లు సీఎం వివరించారు. ఎన్డీఏ కూటమి బలం మరింత పెరిగిందని, ప్రతిపక్ష వైసీపీ భారీగా ఓట్ల శాతాన్ని కోల్పోయిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి, మద్దతుకు ఈ ఫలితాలే నిదర్శనమని సీఎం గణాంకాలతో సహా వివరించారు. స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి, ప్రతిపక్షం వైసీపీకి వచ్చిన ఓట్లు, సీట్లను సీఎం చంద్రబాబు గణాంకాలతోసహా వివరించారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి మొత్తంగా 58.9 శాతం ఓట్ల శాతాన్ని సాధించి విజయదుందుభి మోగించిందని వెల్లడించారు. విపక్షం వైసీపీ ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గిందని వివరించారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీకి కేవలం 33.56 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయని వివరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 39.81 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీ, ఈ స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి ఏకంగా 6.25 శాతం ఓట్లను కోల్పోయింది. ఫలితంగా మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి, వైఎస్సార్సీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం 25.34 శాతం మేర భారీ గ్యాప్ నమోదైందని సీఎం వివరించారు.

ముఖ్యంగా పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం స్పష్టంగా కనిపించిందని తెలిపారు. పట్టణాల్లో ఎన్డీఏ కూటమి 59.9 శాతం ఓట్ షేర్ సాధించగా, వైఎస్సార్సీపీ 34.3 శాతానికే పరిమితమైంది. పట్టణాల్లో ఇరు వర్గాల మధ్య ఓట్ల శాతంలో 25.60 శాతం వ్యత్యాసం నమోదైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ పట్టణాల్లో ఏకంగా 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరిషత్ ఎన్నికలలో కూడా ఎన్డీఏ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ 57.6 శాతం ఓట్ షేర్ సాధించగా, వైఎస్సార్సీపీ 39.7 శాతం ఓట్లను పొందిందని తెలిపారు. పల్లెల్లో కూటమికి, వైఎస్సార్సీపీకి మధ్య ఓట్ల శాతంలో 17.9 శాతం వ్యత్యాసం ఉంది. పరిషత్ ఎన్నికల్లో ఎన్డీఏ 87.5 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. ఇక స్థానాల వారీగా చూస్తే, రాష్ట్రంలోని మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ కూటమి ఏకంగా 575 స్థానాలను చేజిక్కించుకుందని, 9,818 ఎంపీటీసీ స్థానాలకు కూటమి 7,803 స్థానాలను గెలిచిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మండల అధ్యక్ష స్థానాలను కూటమి గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం లెక్కలు చూపారు.

జిల్లాల వారీగా జడ్పీటీసీ ఫలితాలను విశ్లేషిస్తే, రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి పూర్తి ఆధిక్యత సాధించింది. కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైఎస్సార్సీపీ కూటమి కంటే ఎక్కువ సీట్లు సాధించగలిగింది. అంతేకాకుండా, రాష్ట్రంలోని 7 జిల్లాల్లో వైఎస్సార్సీపీకి ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కకపోవడం గమనార్హం. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఖాతా కూడా తెరవలేకపోయిందని సీఎం ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల సిబ్బందికి చెందిన పోస్టల్ బ్యాలెట్లలోనూ కూటమి అద్భుతమైన ఆధిక్యతను ప్రదర్శించిందని సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో పట్టణాల్లో ఎన్డీఏకు 65.7 శాతం పోస్టల్ బ్యాలెట్లు పడగా, వైఎస్సార్సీపీకి 27.42 శాతం మాత్రమే పడ్డాయి. అదేవిధంగా పరిషత్ ఎన్నికల్లో ఎన్డీఏకు 62.83 శాతం పోస్టల్ బ్యాలెట్లు నమోదు కాగా, వైఎస్సార్సీపీకి 31.46 శాతం పడ్డాయి. ప్రజా తీర్పుతో పాటు ఉద్యోగుల ఆమోదం కూడా ప్రభుత్వ పాలనకు లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Tags:    
  • chandrababu 
  • aplocalelections 
  • ndacoalition 
  • ysrcp 
  • andhrapradesh 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS