• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైసీపీ 'వెన్నుపోటు దినం'...

వైసీపీ 'వెన్నుపోటు దినం' వేళ... నేతలకు చంద్రబాబు బిగ్ టాస్క్!

| గత ఏడాది ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడిన సంగతి తెలిసిందే. ఆ ఫలితాల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి.

By - Tupaki Desk
Update: 2025-05-31 16:30 GMT

గత ఏడాది ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడిన సంగతి తెలిసిందే. ఆ ఫలితాల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి. 94% స్ట్రైక్ రేట్ తో కనీవినీ ఎరుగని రీతిలో గెలుపొందాయి. అనంతరం జూన్ 12న ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సమయంలో జూన్ 4న ‘వెన్నుపోటు దినం’ అంటూ వైసీపీ ఓ కార్యక్రమం ప్లాన్ చేయగా.. కూటమి నేతలకు చంద్రబాబు ఒక టాస్క్ ఇచ్చారు!

అవును... వచ్చే నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 'వెన్నుపోటు దినం' నిర్వహించాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. కూటమి సర్కార్ రాకతో ప్రజలకు అన్యాయం జరిగిందని, వారికి ఒక్క సంక్షేమ పథకం కూడా చేరువ కావడం లేదని జగన్ చెబుతున్నారు!

ఈ నేపథ్యంలో కూటమి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, ఎమ్మెల్యేలతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. వచ్చే నెల 12తో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోన్న నేపథ్యంలో.. 1వ తేదీ నుంచి ప్రజల మధ్యకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... మీరు ప్రజల వద్దకు వెళ్లండి.. లేదా, మరేదైనా చేయండి. కానీ, జనం మాత్రం మన గురించి, మన ప్రభుత్వం గురించి మాత్రమే మాట్లాడుకోవాలని.. ప్రభుత్వం అందించే సంక్షేమపైనే చర్చ జరగాలని.. ఇది నాయకులందరి బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ 4న చేపట్టిన కార్యక్రమం గురించి బాబుకు నేతలు తెలిపారు!

ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... మీరు కూడా ప్రజల్లోకి వెళ్లి, ఈ 11 నెలలు ప్రజలకు ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని సూచించారు. 94 శాతం స్ట్రైక్ రేటు సాధించామని.. ప్రజలు తమతోనే ఉన్నారనే.. ఈ విషయాన్ని నేతలంతా గుర్తుపెట్టుకోవాలని.. గడిచిన 11 నెలల్లో ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని.. సంక్షేమం, అభివృద్ధి గురించి వెల్లడించాలని తెలిపారు.

ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు నిర్మించామని.. పెట్టుబడులు పెట్టేలా పెద్ద పెద్ద కంపెనీలను ఒప్పిస్తున్నామని.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామనే విషయం ప్రజలకు చెప్పాలని బాబు సూచించారు. మనం చేసిన మంచిని కూడా చెప్పుకోలేకపోతే తీవ్రంగా నష్టపోతామని, అలాంటి పరిస్థితి రానివ్వొద్దని నేతలకు బాబు తెలిపారు.

Tags:    
  • ChandrababuNaidu 
  • TDP 
  • YSRCPProtest 
  • APGovt 
  • PoliticalStrategy 
  • APPolitics 
  • YSRCP 
  • TDPLeaders 
  • Chandrababu 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS