పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి: చంద్రబాబు
దేశంలో అవినీతి రూపుమాపేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు కూడా ఎంతో కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు.;
దేశంలో అవినీతి రూపుమాపేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు కూడా ఎంతో కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలోనే 2016లో పెద్ద నోట్లను రద్దు చేశారని ఆయన వెల్ల డించారు. తాజాగా మహానాడు వేదికగా ప్రసంగించిన ఆయన.. టీడీపీ హయాంలో పారదర్శక పాలనకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. ఎక్కడా అవినీతి లేకుండా.. పాలనను సాగిస్తున్నామన్నారు. ఇక నుం చి ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయన్నారు.
ఈ క్రమంలోనే పెద్ద నోట్ల ను రద్దు చేయాలన్నది తమ డిమాండ్‌గా చెప్పారు. గతంలోనే తాను పెద్ద నోట్ల ను రద్దు చేయాలని సూచించాన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వేసిన కమిటీలోనూ తాను ఉన్నట్టు చెప్పా రు. పెద్ద నోట్లను రద్దు చేయడంతో అవినీతి, అక్రమాలకు చాలా వరకు బ్రేకులు పడ్డాయన్న చంద్రబాబు ఇప్పుడు ఉన్న పెద్ద నోట్లను కూడా పూర్తిగా రద్దు చేయాలని సూచిస్తున్నట్టు తెలిపారు. తద్వారా మరింత పారదర్శకంగా పాలన అందించే అవకాశం ఉంటుందన్నారు.
నోట్ల స్థానంలో పూర్తిగా ఆర్థిక లావాదేవీలను డిజిటలీకరణ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభు త్వం మెజారిటీ సేవల్లో డిజిటల్ ద్వారానే ఆర్థిక లావాదేవీలు చేస్తోందన్నారు. దీనివల్ల.. ప్రజలకు కూడా ఇబ్బందులు ఉండవని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరింత పారదర్శకమైన డిజిటల్ లావాదేవీల వ్యవస్థను తీసుకువచ్చి.. పెద్ద నోట్లను రద్దు చేస్తే.. అప్పుడు అసలు పెద్దనోట్లతో అవసరమే ఉండబోద న్నారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చంద్రబాబు చెప్పారు.