చంద్రబాబు రెండో సంతకం ఫిక్స్... అదే అంశంపై క్లారిటీ ఇచ్చిన జగన్!

ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రిగా మొదటి సంతకం డీఎస్సీ నోటిక్ఫికేషన్ పై చేస్తానని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-02 04:18 GMT

ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రిగా మొదటి సంతకం డీఎస్సీ నోటిక్ఫికేషన్ పై చేస్తానని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయబోయే రెండో సంతకంపైనా తాజాగా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగించిన చంద్రబాబు ఈ మేరకు తనదైన శైలిలో హామీ ఇచ్చారు. మరోపక్క అదే అంశంపై జగన్ క్లారిటీ ఇచ్చారు!

అవును... చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగించిన చంద్రబాబు... జగన్ పాలనపై ఫైరయ్యారు.. రాష్ట్రాన్ని జగన్‌ నియంతలా పాలించాలనుకున్నారని, విధ్వంసం చేయడమే ఆయన స్వభావం అని దుయ్యబట్టారు. భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో... స్కూళ్లకు రంగులు వేస్తే.. పిల్లలకు చదువు వస్తుందా? అని చంద్రబాబు తనదైన శైలిలో ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయబోయే రెండో సంతకంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా... ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చి.. ఆస్తులను బలవంతంగా రాసుకున్నారని ఆరోపించిన చంద్రబాబు... ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు ఫైల్ పైనే రెండో సంతకం చేస్తానని హామీ ఇచ్చారు.

ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ పై జగన్..!:

సీఎం అయ్యాక రెండో సంతకం చేస్తానని ఏపీ ప్రజలకు హామీ ఇస్తున్న చంద్రబాబు... ఈ విషయంపై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. దీంతో... ఈ "ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్" పై జగన్ స్పందించారు. ఇందులో భాగంగా... ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని.. జగన్‌ మీ భూములు కాజేస్తాడంటూ మెసేజ్‌ లు పంపుతూ, ఫోన్లు చేసి చెబుతున్నారని ఫైరయ్యారు. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ నీలా భూములు లాక్కునేవాడు కాదని స్పష్టం చేశారు.

Read more!

ఇదే సమయంలో... మీ భూముల మీద మీకు సర్వహక్కులూ కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశ్యం అని చెప్పిన జగన్... 100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు మాత్రమే సర్వే జరిగిందని, ఆ తర్వాత ఇలా గ్రామ సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లను పెట్టించి గతంలో ఎవ్వరూ సర్వే చేయించలేదని తెలిపారు. ఆ సర్వే లేక, భూముల కొలతలు సరిగ్గా లేక అమ్ముకోడానికి కొనుక్కోడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఈ క్రమంలోనే... కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టు తిరుగుతూ, డబ్బులు ఇచ్చుకుంటూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ పరిస్థితి మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించామని సీఎం వివరించారు.

Tags:    

Similar News