• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాంగ్రెస్ పార్టీయే హిందూ...

కాంగ్రెస్ పార్టీయే హిందూ పార్టీ... వివరించిన బండ్ల గణేష్!

| సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అని ఫ్యాన్స్ పిలుచుకునే ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేశ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By - Tupaki Desk
Update: 2024-05-02 14:51 GMT

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అని ఫ్యాన్స్ పిలుచుకునే ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేశ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీతో తనకున్న కమిట్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తాను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టానని.. కాంగ్రెస్ పార్టీలోనే చనిపోతా అని అంటున్నారు గణేష్.

అవును... మంథనిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బండ్ల గణేష్... కాంగ్రెస్ పార్టీతో తనకున్న అనుబంధం, కమిట్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనవంతు ప్రచారం చేస్తున్న ఆయన... తెలంగాణలో పద్నాలుగు లోక్ సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పక్కాగా గెలవాలని అన్నారు.

ఇందులో భాగంగా ప్రధానంగా పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పిన ఆయన... తాను మంథనికి వచ్చిప్పుడు కొందరిని ఎవరికి ఓటు వేస్తావని అడిగితే... సర్ మేం హిందువులం.. బీజేపీకి ఓటేస్తాం అని చెప్పారని పేర్కొన్నారు. దీంతో... అసలైన హిందుత్వ పార్టీ అంటే కాంగ్రెస్సే అని వారిని క్లారిటీ ఇచ్చినట్లు బండ్ల వెల్లడించారు.

ఈ సందర్భంగా వారికి హిందుత్వం గురించి మరింతగా వివరించినట్లు చెప్పిన బండ్ల గణేష్... తనకు 50 సంవత్సరాలని, ఇందులో 34 ఏళ్లు శబరిమలై వెళ్లి వచ్చినట్లు తెలిపారు. ఈ సమయంలో బీజేపీకే ఓటు వేస్తామని చెప్పిన వ్యక్తితో... "నువ్వు నాకంటే గొప్ప హిందువు కాదు.. మీరు శ్రీరామ్ శ్రీరామ్ అంటూ పేరెత్తుతున్నారు.. కానీ, నేను బతికేదే శ్రీరాముడిని నమ్ముకొని!" అని వివరించినట్లు చెప్పుకొచ్చారు.

అదేవిధంగా... తాము నమ్ముకునేదే ఆంజనేయుడిని అని.. ఉదయం నిద్రలేస్తే అంజనేయుడిని, వెంకటేశ్వరస్వామిని, అయ్యప్పను తలుచుకుంటామని.. ఇదే సమయంలో... తాము ముస్లిం, క్రైస్తవులను గౌరవిస్తాం మని.. ఈ సమయంలో తమ కంటే హిందువులు ఎవరూ లేరని.. తమ అణువణువునా హిందుత్వం ఉందని.. అసలు కాంగ్రెస్ పార్టీయే హిందూ పార్టీ అని వారికి సమాధానం ఇచ్చినట్లు గణేష్ వెల్లడించారు.


సభలో స్పీచ్ ఇరగదీసిన
కాంగ్రెస్ లీడర్ బండ్ల గణేష్#bandlaganesh #Congress #TelanganaNews #PoliticsLive #LokSabhaElections2024 #bigtvlive@INCTelangana pic.twitter.com/cSjOMF8ZgJ

— BIG TV Breaking News (@bigtvtelugu) May 2, 2024


Tags:    
  • Loksabhaelections 
  • Congressparty 
  • Brsparty 
  • Bjp 
  • RamMandir 
  • LordRama 
  • Hanuman 
  • Venkateswara 
  • Ayyappa 
  • HinduParty 
  • HanumanChalisa 
  • BandlaGanesh 
  • Muslims 
  • Christians 

Similar News

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

Copyright @2026

Powered by Blink CMS