• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అయోధ్య రాముడికి...

అయోధ్య రాముడికి ‘సూర్య’తిలకం.. చూసి తీరాల్సిన అద్భుతం

| నేడు దేశమంతా శ్రీరామ నామస్మరణతో పులకించిపోతోంది. భక్తులు రామయ్య ఆలయాలకు పోటెత్తారు.

By - Tupaki Desk
Update: 2025-04-06 10:18 GMT

నేడు దేశమంతా శ్రీరామ నామస్మరణతో పులకించిపోతోంది. భక్తులు రామయ్య ఆలయాలకు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. గత ఏడాది జనవరిలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత ఇది రెండవ శ్రీరామనవమి. ఈ శుభ సందర్భంగా అయోధ్య ఆలయంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి విగ్రహం నుదిటిపై సూర్య కిరణాలు తిలకంలా ప్రకాశించాయి. ఈ అపురూప ఘట్టాన్ని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఆలయ నిర్మాణం సమయంలోనే సూర్య కిరణాలు స్వామివారి నుదిట తిలకం దిద్దేలా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ అద్భుత దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయోధ్య రామాలయం నిర్మాణం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, నిపుణులు మరియు కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అయోధ్య రామాలయంలో ఈ సూర్య తిలకం వ్యవస్థను ఏర్పాటు చేశారు. గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడేలా దీనిని రూపొందించారు.

-కటకాలతో ప్రత్యేక ఏర్పాట్లు:

రామయ్య విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడటానికి ఆలయం మూడవ అంతస్తులో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కుంభాకార - పుటాకార కటకాలను ఉపయోగించి, వాటిని పైపులతో అనుసంధానించి ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించారు. ఆలయం పైభాగంలో సూర్యకాంతిని గ్రహించడానికి ఒక పరికరం ఏర్పాటు చేశారు. అక్కడ గ్రహించిన కాంతి, పైపుల లోపల అమర్చిన కటకాల ద్వారా ప్రసరించి, బాలరాముడి నుదుటిపై అచ్చంగా తిలకం వలె కనిపిస్తుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ప్రతి శ్రీరామ నవమి రోజున ఈ సూర్య తిలకం ఆవిష్కృతం అవుతుంది. దీని కోసం ప్రత్యేకమైన మెకానిజం ఉంది. గేర్ టీత్ మెకానిజం ద్వారా 365 రోజులు సూర్యకాంతిని గ్రహించే అద్దం కదులుతూ ఉంటుంది. సరిగ్గా శ్రీరామనవమి సందర్భంగా, అది నిర్ణీత స్థానానికి చేరుకుంటుంది, తద్వారా సూర్య కిరణాలు బాలరాముడి నుదుటిపై తిలకంలా పడతాయి. ఈ ఆలయ నిర్మాణంలో కేవలం వాస్తు శాస్త్రాన్నే కాకుండా, అనేక శాస్త్రీయ , సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని స్పష్టమవుతోంది.

గత ఏడాది రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత అయోధ్య రామాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కోట్లాది మంది భక్తులు అయోధ్యకు వచ్చి బాలరాముడిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నారు. మహాకుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కూడా యూపీలోని అయోధ్యకు వెళ్లి రాముడి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

सूर्यतिलक प्रभु श्री राम लला का सूर्यदेव स्वयं करने पधारे हैं। #RamNavami ❤️ pic.twitter.com/qA8HyGA3ZT

— Ayodhya Darshan (@ShriAyodhya_) April 6, 2025
Tags:    
  • RamNavami2025 
  • AyodhyaRamMandir 
  • SuryaTilak 
  • DivineArchitecture 
  • LordRam 
  • RamMandirMiracle 
  • SolarEngineering 
  • SpiritualIndia 
  • VastuShastra 
  • IndianScience 
  • RamLalla 
  • AyodhyaDiaries 
  • BhaktiAndScience 
  • SanatanDharma 

Similar News

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS