225...ఈ నంబర్ జనసేనకే భారీ అడ్వాంటేజా ?

ఏమిటా 225 నంబర్. ఏమా కధ అంటే రాజకీయం గురించి తెలిసిన వారికి ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది.;

Update: 2025-07-18 03:15 GMT

ఏమిటా 225 నంబర్. ఏమా కధ అంటే రాజకీయం గురించి తెలిసిన వారికి ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది. ఏపీలో ఉన్నవి ప్రస్తుతం 175 అసెంబ్లీ సీట్లు అవి కాస్తా 2029 ఎన్నికల నాటికి 225 సీట్లుగా మారుతాయని అంటున్నారు. విభజన నాటి హామెలు చట్టంలో ఉన్న నిబధనల ప్రకారం ఏపీలో కచ్చితంగా 225 సీట్లు అసెంబ్లీకి వస్తాయని అంటున్నారు.

అయితే ఈ భారీ నంబర్ వల్ల లాభమెవరికి అన్నదే ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. ఇక టీడీపీ వరకూ చూస్తే ఫుల్ క్రౌడ్ తో ఉంది. ఆ పార్టీకి ఎన్ని సీట్లు పెంచినా ఇంకా బోలెడు మంది అభ్యర్ధులు ఉంటారు అని అంటున్నారు. టీడీపీ ఇప్పటికే కిక్కిరిసి ఉంది. ఆ పార్టీలో ఇక చేరినా ప్రాధాన్యత ఉండదు. అసలు చేరి ఉపయోగం ఉండదని అనుకున్న వారు వేరే పార్టీల వైపు చూస్తారు.

ఇక ఏపీలో 2029లో కూడా కూటమి తోనే అంతా పోటీకి దిగుతారు అని అంటున్నారు. దాంతో టీడీపీలో టికెట్ దక్కదని భావించిన వారు ముందే సేఫ్ జోన్ కోసం చూస్తున్నారు అని అంటున్నారు టీడీపీలో యువతకు టికెట్లు ఈసారి ఎక్కువగా ఇస్తారు. దాంతో సీనియర్లు తమ వారసులకు టికెట్లు దక్కితే ఓకే లేకపోతే వారే స్వయంగా జనసేనలోకి వారికి పంపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జనసేనలో చేరితే సీటు గ్యారంటీ, అలాగే పొత్తు ఉంటే గెలుపు గ్యారంటీ అని ఆలోచిస్తున్నారుట.

మరో వైపు ఊస్తే టీడీపీ బీజేపీ నుంచే జనసేనలోకి జంప్ చేయాలని చూస్తున్న నాయకులు చాలా మంది ఉన్నారని అంటున్నారు. వారంతా వచ్చే ఎన్నికల కోసమే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. ముందే కర్చీఫ్ వేసేస్తే సీటు గ్యారంటీ ఇక నేరుగా చట్టసభలలోకి వెళ్ళిపోవడమే అని ఆలోచిస్తున్నారుట.

ఇంకో వైపు చూస్తే వైసీపీ నుంచి కూడా జనసేనలో చేరేందుకు చాలా మంది చూస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని అధినేత చెబుతున్నా ఇంకా కొన్ని రీజియన్స్ లో అయితే ఫ్యాన్ రెక్కలు తిరగడంలేదు అని అంటున్నారు. కోస్తా జిల్లాలతో పాటు విశాఖ వంటి చోటో వైసీపీ ఎత్తిగిల్లుతున్న సూచనలు కనిపించకపోవడంతో ఆ పార్టీలో వారు చాన్స్ దొరికితే చాలు జనసేనలో చేరి అయినా చట్టసభలలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారుట. ఇంకో వైపు చూస్తే సామాజిక సమీకరణలు ప్రాంతీయ లెక్కలు ఇతర అంశాలతో కూడా టీడీపీ వైసీపీ బీజేపీల నుంచి నేతలు జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

ఈసారి జనసేన కనీసంగా 50 సీట్లు తక్కువ లేకుండా పోటీ చేయడం ఖాయమని భావిస్తున్నారు. దాంతో జనసేనలో చేరడమే బెటర్ అనుకుంటున్నారుట. అటు వైసీపీని వీడి ఇటు టీడీపీలో ఉన్నా చాన్స్ లేదని అనుకుంటున్న వారు సైతం పునరాలోచన చేస్తూ జనసేన దారి పడుతున్నారని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. పవన్ కళ్యాణ్ వీరందరికీ కండువా కప్పాలి, చేరేందుకు అనుమతి ఇవ్వాలి. మరి అదే అసలైన చిక్కుముడి అని అంటున్నారు. ఆయన కనుక ఓకే అంటే పోలోమంటూ జనసేన వైపు దూకేయడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News