గుంటూరుతో గుడ్ బై...జగన్ ని చెప్పాలనే !

దీంతో ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నాయకులతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.;

Update: 2025-06-28 18:14 GMT

ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. అంతే కాదు రాజకీయ నిబద్ధత కలిగిన వారు. వర్తమాన రాజకీయాల్లో అలాంటి వారు అరుదు. ఆయన మొత్తం రాజకీయ జీవితంలో అధికారం కంటే ప్రతిపక్షంలోనే ఉండడం అలవాటు అయింది. ఆయనే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన కాంగ్రెస్ లో వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు.

అందుకే జగన్ పార్టీ పెట్టిన వెంటనే ఆయన వెంట వచ్చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసంతృప్తి అన్న మాట అయితే ఆయన నోట లేదు. జగన్ ఏమి చెబితే చేయడమే ఆయన ఆలోచనగా ఉంటూ వచ్చింది. ఇదిలా ఉంటే ఏడు పదుల వయసుకు చేరువ అవుతున్న అంబటి రాబాబుకు గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాన్ని జగన్ అప్పగించారు. టీడీపీకి కంచుకోట లాంటి సీట్లో అంబటిని పోరాడమని పంపించారు.

దీంతో ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నాయకులతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను 1989లో రేపల్లె అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడంతో తన రాజకీయ జీవితం మొదలైందని ఆ తరువాత కాస్తా అది సత్తెనపల్లి వరకూ వెళ్ళిందని, ఇపుడు గుంటూరు దాకా వచ్చిదని వివరించారు.

గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాన్ని జగన్ తనకు చివరి అవకాశమనే ఇచ్చారని అంబటి అన్నారు. తాను రాజకీయంగా రిటైర్మెంట్ దశలో ఉన్నానని ఆయన అన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయడంతోనే తన ఎన్నికల రాజకీయం ముగుస్తుంది అన్నట్లుగా అంబటి కామెంట్స్ చేశారు.

నిజానికి అంబటికి ఎన్నికల రాజకీయాల మీద ఆసక్తి ఎంతవరకూ ఉందో తెలియదు అని అంటున్నారు. అయితే ఆయన సత్తెనపల్లి నుంచి మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. మరోసారి అక్కడ నుంచే తేల్చుకోవాలని అనుకుంటున్నారు. 2029లో గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలని కూడా భావించారు అని అంటారు.

అనూహ్యంగా ఆయనకు గుంటూరు పశ్చిమ బాధ్యతలు దక్కాయి. మరో నాలుగేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. అంటే చాలా సమయం చేతిలో ఉన్నట్లే. మరి ఈ మధ్యకాలంలో అంబటి తన పనితీరుతో టీడీపీ కంచుకోటను కరిగించి వైసీపీతో పాటు తానూ గెలుపు గుర్రం ఎక్కాలి. మొత్తానికి తాను రిటైర్ అవుతాను అని వైసీపీలో ప్రముఖ రాజకీయ నాయకుడు చెప్పేశారు అన్న మాట. మరి జగన్ కి చెప్పాలనేనా అని ఈ స్టేట్మెంట్ అని అంతా అనుకుంటున్నారు. అంబటి రాంబాబు విషయం తీసుకుంటే ఆయన చురుకైన రాజకీయ నాయకుడు. ఆయన సైడ్ అయినా రిటైర్ అయినా వైసీపీకి అది తీరని లోటే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News