రేర్ క్లిక్: జూ.కత్రిన ఫ్యాన్ మూవ్‌మెంట్

న‌టిగా కెరీర్ ప్రారంభించిన దాదాపు 15 ఏళ్ల‌ త‌ర్వాత జ‌రీన్ ఖాన్ ఇన్‌స్టాలో కత్రినా ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న వీడియోను షేర్ చేసింది.;

Update: 2025-07-08 03:45 GMT
రేర్ క్లిక్: జూ.కత్రిన ఫ్యాన్ మూవ్‌మెంట్

అచ్చం ఐశ్వ‌ర్యా రాయ్ లాంటి మ‌రో అందాల రాణిని వెతికి ప‌ట్టుకున్నాడు స‌ల్మాన్ భాయ్. ఈ డూప్లికేట్ ఐష్‌ మ‌రెవ‌రో కాదు- స్నేహా ఉల్లాల్. నీలి క‌ళ్లతో అంద‌మైన ఎక్స్‌ప్రెష‌న్ తో ఉల్లాల్ అచ్చు గుద్దిన‌ట్టు ఐశ్వ‌ర్యారాయ్ ని త‌ల‌పించేది. ఆ త‌ర్వాత కూడా అచ్చు గుద్దిన‌ట్టు క‌త్రిన కైఫ్ లా ఉండే ఇంకో డూప్ ని వెతికి ప‌ట్టుకున్నాడు ఇదే స‌ల్మాన్. ఈ బ్యూటీ మ‌రెవ‌రో కాదు- జ‌రీన్ ఖాన్. ఈ అమ్మడి హావ‌భావాలు అచ్చు గుద్దిన‌ట్టు క‌త్రిన‌నే త‌ల‌పించేవి.

అయితే డూప్లికేట్లుగా బ‌రిలోకి దిగిన ఈ ఇద్ద‌రు భామ‌లు ప‌రిశ్ర‌మ‌లో ఆశించిన స్థాయికి చేరుకోలేక‌పోయారు. ఒక‌రి పోలికతో క‌నిపించ‌డం ఒక ర‌కంగా అదృష్టం.. మ‌రో ర‌కంగా దుర‌దృష్టం కూడా. ఐశ్వ‌ర్యారాయ్, క‌త్రిన అంత‌టి అంద‌గ‌త్తెలు ప‌బ్లిక్ లోకి వ‌స్తే, లుక్కు కూడా మెయింటెయిన్ చేయాలి. పైగా మంది మార్భ‌లం ఎప్పుడూ వెంటే ఉండాలి. స‌రిగ్గా ఇలాంటివి త‌మ‌ను చాలా ఇబ్బంది పెట్టాయ‌ని చెప్ప‌క‌నే చెప్పింది జ‌రీన్ ఖాన్. తాను ఏవో దుస్తులు ధ‌రించి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే, వెంట‌నే కామెంట్లు చేసేవార‌ని, దాంతో భ‌య‌ప‌డి ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌డ‌మే మానుకున్నాన‌ని కూడా జ‌రీన్ ఖాన్ పేర్కొంది.

న‌టిగా కెరీర్ ప్రారంభించిన దాదాపు 15 ఏళ్ల‌ త‌ర్వాత జ‌రీన్ ఖాన్ ఇన్‌స్టాలో కత్రినా ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రేస్ ప్రీమియ‌ర్ సంద‌ర్భంగా థియ‌ట‌ర్ వ‌ద్ద కత్రినా కైఫ్ నుండి ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న త్రోబ్యాక్ వీడియోను షేర్ చేయ‌గా అది వేగంగా దూసుకెళుతోంది.

జరీన్ వీడియోతో పాటు ఒక పొడవైన నోట్ రాసింది. ఈ నోట్ లో అస‌లు తాను చిత్ర పరిశ్రమలో భాగం అవుతానని అనుకోలేదని జ‌రీన్ చెప్పింది. మొద‌టి సినిమా `వీర్` తర్వాత జీవితం చాలా చెడ్డగా మారింది. నాపై చాలా విమర్శలు వచ్చాయి. ఆ సినిమా నా జీవితాన్ని మార్చివేసిందని తెలిపింది జ‌రీన్. మొదట్లో నన్ను కత్రినా కైఫ్ తో పోల్చడం చూసి నేను చాలా సంతోషించాను కానీ పరిశ్రమలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఒకప్పుడు అధిక బరువు ఉన్న నన్ను కత్రినాతో పోల్చడం చాలా పెద్ద విషయం.. కానీ దీంతో పెద్ద దెబ్బ తగిలింద‌ని జ‌రీన్ వ్యాఖ్యానించింది. ప‌రిశ్ర‌మ‌లో నేను దారి త‌ప్పిన బిడ్డ‌ను. ఇక్క‌డ ఎవ‌రూ నాకు తెలీదు. కానీ స‌ల్మాన్ న‌న్ను లాంచ్ చేసినందుకు గ‌ర్విష్టిని అయ్యాన‌ని అంతా భావించారు. అది ప‌రిశ్ర‌మ నుంచి వేరు చేసింది. అలాగే నా దుస్తుల గురించి కామెంట్లు చేసారు. ఒక‌రితో పోలిక చాలా ఇబ్బంది పెట్టింద‌ని కూడా జ‌రీన్ వెల్లడించారు.

Tags:    

Similar News