సూప‌ర్‌స్టార్ మౌనంతో నిర్మాత‌కు కోట్ల‌లో లాస్

అలాంటి ఒక అన్యాయాన్ని బ‌య‌ట‌కు చెప్పుకుని బావుర‌మ‌న్నాడు ఒక నిర్మాత‌. త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని అత‌డు ఎంత మొర‌పెట్టుకున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.;

Update: 2026-02-03 03:00 GMT

గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మలో ఎన్నో పాతిపెట్టిన‌ నిజాలు బ‌య‌ట‌కు రాకుండానే దాగి ఉంటాయి. ముఖ్యంగా ప్ర‌భావవంత‌మైన వ్య‌క్తులు ఇన్వాల్వ్ అయి ఉంటే అలాంటి విష‌యాలు వెంట‌నే బ‌య‌ట‌కు రావు. క‌ఠోర‌మైన స‌త్యం చుట్టూ ఉచ్చు అంత బ‌లంగా బిగుసుకుని ఊపిరాడ‌నివ్వ‌దు.

ఒక్కోసారి త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని గొంతెత్తి అరిచినా, దానిని ప‌ట్టించుకునే నాధులే ఉండ‌రు. స‌ద‌రు ప్ర‌భావ‌వంత‌మైన వ్య‌క్తిని నిల‌దీసే ధైర్యం ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికీ ఉండ‌దు కూడా. అందువ‌ల్ల కొన్ని నిజాలు తెలిసీ వాటి జోలికి వెళ్ల‌కుండా ఆ చుట్టుప‌క్క‌ల వ్య‌క్తులు కూడా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ముఖ్యంగా సినీప‌రిశ్ర‌మ‌లో ఇదో విచిత్ర‌మైన వైఖ‌రి. ఇలాంటి చాలా విష‌యాలు ద‌శాబ్ధాల‌ త‌ర్వాత కూడా బ‌య‌ట‌కు చెప్పుకుని ఆవేద‌న చెందేవాళ్లున్నారు.

అలాంటి ఒక అన్యాయాన్ని బ‌య‌ట‌కు చెప్పుకుని బావుర‌మ‌న్నాడు ఒక నిర్మాత‌. త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని అత‌డు ఎంత మొర‌పెట్టుకున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఒక ప్ర‌ముఖ స్టార్ హీరో నా క‌థ‌కు ఓకే చెప్ప‌డ‌మే గాక న‌న్ను నిర్మాత‌గా అంగీక‌రించాడు. అయినా ఆ త‌ర్వాత ఆ ప్రాజెక్ట్ నాకు కాకుండా పోయింది. ఆ సూప‌ర్ స్టార్ త‌న సొంత బ్యాన‌ర్ లో సినిమాని నిర్మిస్తున్నాన‌ని చివ‌రి నిమిషంలో నాతో చెప్పారు. కానీ నేను దానికి స‌సేమిరా అన్నాను. ఆ త‌ర్వాత అదే స్క్రిప్టును టైటిల్ మార్చేసి వేరొక నిర్మాణ సంస్థ‌తో క‌లిసి సినిమా తీసారు. ఆ సినిమా ప‌రాజ‌యం పాలైంది. దీనివ‌ల్ల అప్ప‌టికే సూప‌ర్ స్టార్ కి నేను చెల్లించిన 4 కోట్ల అడ్వాన్స్ తిరిగి రాలేదు.

ఆ నిర్మాణ సంస్థ‌పై నేను కోర్టులో పోరాడుతున్నాను. ఇది ఇప్ప‌టికీ ప‌రిష్కారం లేని స‌మ‌స్య‌గానే మిగిలి ఉంది.. అని త‌న గోడును వెల్ల‌బోసుకున్నాడు స‌ద‌రు ఔత్సాహిక నిర్మాత‌. ఈ ఎపిసోడ్ లోని సూప‌ర్ స్టార్ హిందీ ప‌రిశ్ర‌మ‌లో ద‌శాబ్ధాల చ‌రిత్ర ఉన్న అగ్ర న‌టుడు. తెలుగులోను అడ‌పాద‌డ‌పా న‌టిస్తున్నారు. ఆరోజు విమాన ప్ర‌యాణంలో త‌నకు అన్యాయం జ‌రుగుతోంద‌ని చెప్పిన‌ప్పుడు ఆ సూప‌ర్ స్టార్ కేవ‌లం న‌వ్వి వ‌దిలేసాడు త‌ప్ప‌, ఆ ప్రాజెక్టుకు నువ్వే నిర్మాత అని చెప్ప‌లేదని త‌న ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కాడు యువ‌నిర్మాత‌. రంగుల పరిశ్ర‌మ‌లో ఇలాంటి క‌థ‌లు నిరంత‌రం ఎన్నో వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా స్క్రిప్టులు కొట్టేసి, వాటి టైటిళ్లు మార్చేసి వేరే బ్యాన‌ర్ల‌లో సినిమాలు తీసేవాళ్లున్నారు.

ఇలాంటివి చేసేవాళ్లు అనామ‌కులు అయితే అంత‌గా ప‌ట్టించుకోరు కానీ, పేరున్న ప్ర‌ముఖ హీరోలు, ద‌ర్శ‌క‌ నిర్మాత‌లే ఇలాంటి ప‌నులు చేసిన‌ప్పుడు బాధితులు దీని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలి? ఏళ్ల త‌ర‌బ‌డి తాను చేసిన హార్డ్ వ‌ర్క్, క్రియేటివిటీ స‌హా పెట్టిన పెట్టుబ‌డులు అన్నీ గంగ‌లో క‌లిసిపోయిన‌ట్టే క‌దా!! ఇలాంటివి జీవితాల్ని ఎండ్ చేస్తాయి. తిరిగి కోలుకోవ‌డం అంత సులువు కాదు! కానీ ఇలాంటి అన్యాయాలు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోను జ‌రుగుతూనే ఉన్నాయి! వీటికి చెక్ పెట్ట‌డానికి ఒక బ‌ల‌మైన‌ వ్య‌వ‌స్థ ఏదీ లేనే లేదు. ఎవ‌రైనా కోర్టుకు వెళ్లి పోరాడాల్సిందే..! కానీ అంతా అయిపోయాక అక్క‌డ పోరాడే శ‌క్తి కూడా బాధితుడికి ఉండ‌దు!

Tags:    

Similar News