ఉస్తాద్.. ఇంకెప్పుడు క్లారిటీ వచ్చేది..?

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌ కు రెడీగా ఉన్నా.. విడుదల తేదీ మాత్రం ఇంకా ఫిక్స్ కాకపోవడం హాట్ టాపిక్‌ గా మారింది;

Update: 2026-02-03 06:08 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌ కు రెడీగా ఉన్నా.. విడుదల తేదీ మాత్రం ఇంకా ఫిక్స్ కాకపోవడం హాట్ టాపిక్‌ గా మారింది. ముఖ్యంగా బాబాయ్ కోసం అబ్బాయి వెయిటింగ్ అన్నట్టుగా సినిమా పరిస్థితి మారిందన్న చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ముందుగా సినిమాను సమ్మర్‌ లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఆ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు డబ్బింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా తన డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేయనున్నారని సమాచారం. ఆర్‌ఆర్, ఫైనల్ మిక్సింగ్ పూర్తయితే సినిమా పూర్తిగా రిలీజ్‌ కు సిద్ధమవుతుంది.

టెక్నికల్‌ గా అన్నీ రెడీ అయినప్పటికీ అసలు అడ్డంకి రిలీజ్ డేట్ దగ్గరే. మార్చి నెలలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు థియేటర్లకు క్యూ కడుతుండటంతో మేకర్స్ తర్జనభర్జనలు పడుతున్నారు. ధురంధర్ 2, టాక్సిక్, ప్యారడైజ్, పెద్ది వంటి భారీ చిత్రాలు ఇప్పటికే తమ తేదీలను లాక్ చేసుకున్నాయి. అంతటి పోటీలో ఉస్తాద్ భగత్ సింగ్ ను తీసుకురావడం రిస్క్‌ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ కాలేదు. మార్చి 27న రావాల్సిన ఆ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. దీంతో పెద్ది టీమ్ కొత్త తేదీ ప్రకటించే వరకు ఉస్తాద్ టీమ్ వేచి చూస్తోందని సమాచారం. అంటే బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కోసం అబ్బాయి రామ్ చరణ్ సినిమా డేట్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది.

పెద్ది వాయిదా పడితే అదే తేదీని ఉస్తాద్ భగత్ సింగ్ లాక్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అధికారిక ప్రకటన ఆలస్యమవుతోందని అంటున్నారు. అవుట్‌ పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీపై దృష్టి పెట్టిన మేకర్స్ సరైన రిలీజ్ విండో కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంగా సినిమా సిద్ధంగా ఉన్నా.. సరైన సమయం కోసం ఎదురుచూపులు మాత్రం కొనసాగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కోసం ఆత్రుతగా చూస్తున్నారు. బాబాయ్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తారోనన్న ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. కానీ అయితే రిలీజ్ డేట్ త్వరగా ఫిక్స్ చేసి ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించాల్సి ఉంది. లేకుంటే ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుంది. అందుకే మేకర్స్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో.. ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.. ప్రమోషన్స్ లో స్పీడ్ ఎప్పుడు పెంచుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News