బ్లాక్ బస్టర్ సాంగ్..మలైకా ఫస్ట్ ఛాయిస్ కాదా?
చాట్ షో `జీనా ఇసీకా నామ్`లో పాల్గొన్న ఫరా ఖాన్ `ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్యా` మేకింగ్ వెనకున్న ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది.;
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ `దిల్ సే`. లవ్‌స్టోరీస్‌కి టెర్రరిజాన్ని లింకప్ చేస్తూ సరికొత్త ప్రేమకథల్ని ఆవిష్కరించే వెండితెర మాంత్రికుడు మణిరత్నం ఈ మూవీని రూపొందిస్తే భరత్ షా, మణిరత్నం, శేఖర్ కపూర్ వంటి హేమా హేమీలతో కలిసి రామ్ గోపాల్ వర్మ ఈ మూవీని నిర్మించాడు. మనీషా కోయిరాలా, ప్రీతి జింటా హీరోయిన్‌లుగా నటించారు. ప్రీతి జింటాకు ఇదే ఫస్ట్ మూవీ. 1998, ఆగస్టులో విడుదలైన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు.
గుల్జార్ అందించిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్‌గానే ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. అప్పట్లో టాప్‌లో నిలిచిన ఈ ఆల్బమ్‌లోని `ఛల్ ఛయ్య ఛయ్యా` ఏరేంజ్‌లో యూత్‌ని ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊటీలో ప్రత్యేక ట్రైన్‌పై దీన్ని ఫరాఖాన్ షూట్ చేసింది. షారుక్‌తో పాటు ఈ పాటలో హాట్ ఐటమ్ లేడీ మలైకా అరోరా నటించింది. ఈ పాటలో మలైకా వేసిన స్టెప్పులు, తన కాస్ట్యూమ్స్ చాలా వరకు ఈ పాట టాప్‌లో నిలిచేలా చేశాయి. అయితే ఐకానిక్ సాంగ్‌గా నిలిచిన ఈ పాట కోసం ముందు మలైకా అరోరాని అనుకోలేదట.
ఈ విషయాన్ని రీసెంట్‌గా డ్యాన్స్ మాస్టర్ ఫరా ఖాన్ బయటపెట్టింది. చాట్ షో `జీనా ఇసీకా నామ్`లో పాల్గొన్న ఫరా ఖాన్ `ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్యా` మేకింగ్ వెనకున్న ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. ఈ సాంగ్ కోసం ముందు చాలా మందిని అనుకున్నాం కలిసాం. కానీ ఎవరూ సెట్ కాలేదు. అయితే చివరి నిమిషంలో ఈ పాట కోసం మలైకాని ఫైనల్ చేసుకున్నాం. పాట షూట్‌కి వారం ముందు వరకు కూడా మాకు ఎవరూ లభించలేదు. అలాంటి తరుణంలో మలైకాకు ఫోన్ చేసి చెప్పాను` అని తెలిపింది ఫరాఖాన్.
అంతే కాకుండా తనకు డ్యాన్స్ వస్తుందన్న విషయం కూడా తనకు తెలియదని, అయితే తను అయితేనే ఈ పాటకు బాగుంటుందని భావించి ఫోన్ చేశానని తెలిపింది. మణిరత్నం నిర్ణయాన్ని తీసుకునే అవకాశం నాకే ఇవ్వడంతో మలైకాని ఫైనల్ చేశానని స్ఫస్టం చేసింది. ఈ పాటని బుల్లేషా రాసిన `తేరే ఇష్క్ నచాయా` నుంచి తీసుకున్నారట. పాప్- ఫోక్‌ని మిలితం చేసి తెరకెక్కించిన ఈ సాంగ్ అప్పట్లో యువతని ఓ ఊపు ఊపేసింది. మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్‌లో ట్రెండ్ అయింది.
స్పెషల్ ఐటమ్ నంబర్లకు ప్రత్యేక ప్రేరణగా నిలిచింది. చిత్రం ఏంటంటే అంతకు ముందు నటిగా ఓ సినిమా చేసిన మలైకాకు `దిల్ సే` స్పెషల్ ఐటమ్ డ్యాన్సర్‌గా ప్రత్యేక గుర్తింపుని తెచ్చి పెట్టింది. ఇది ఆమె నటించిన తొలి ఐటమ్ నంబర్ కావడం విశేషం. ఫస్ట్ సాంగే బ్లాక్ బస్టర్ కావడంతో మలైకా అరోరా స్పెషల్ సాంగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారి సినిమా సక్సెస్‌లలో ఓ భాగం అవుతూ వచ్చింది.