భాగ్యశ్రీ 'పానీపూరి' పంచ్ ఎవరి పై?
భాగ్యశ్రీ ప్రస్తుతం సోషల్ మీడియాల్లో స్పీడ్ గానే ఉంది. అయితే ఈ భామ ఎప్పుడూ హద్దు మీరని, డీసెంట్ ఫోటోషూట్లతో అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.;
అందం ఉంది... ప్రతిభ ఉంది.. కానీ లక్ కలిసి రావడం లేదు... దీంతో వరుస ఫ్లాపులు ఎదుర్కొని డీలా పడిపోయింది భాగ్యశ్రీ. అయితే ప్రతి ఫ్లాప్ నుంచి అంతో ఇంతో నేర్చుకుంటున్న ఈ బ్యూటీ ప్రతి సినిమాలో నటన పరంగా షైన్ అవుతూనే ఉంది. సినిమాలు ఫ్లాపులైనా కానీ, నటిగా ఏనాడూ భాగ్యశ్రీ ఫ్లాప్ కాలేదు. అందుకే ఈ భామకు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వస్తున్నాయి.
మాస్ మహారాజా రవితేజ సరసన `మిస్టర్ బచ్చన్` సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ ఆరంభమే పెద్ద ఫ్లాప్ ని ఎదుర్కొంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన `కింగ్ డమ్` మరో పెద్ద నిరాశ. ఇటీవలే విడుదలైన రామ్ పోతినేని `ఆంధ్రా కింగ్ తాలూకా` అయినా తనను గట్టున పడేస్తుందని చాలా ఆశించింది. కానీ మరోసారి నిరాశే ఎదురైంది. ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినా, భాగ్యశ్రీ- రామ్ జంట కెమిస్ట్రీకి మంచి మార్చులే వేసినా కానీ, ఆశించిన స్థాయి విజయం దక్కలేదు. ఇది కేవలం యావరేజ్ గా మాత్రమే మిగిలిపోవడం మరోసారి భాగ్యశ్రీని కుంగదీసింది. వరుస పరాజయాల కెరీర్ లో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన కాంత ఫలితం కొంత ఊరట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ విజయం సాధించినా, ఇందులో భాగ్యశ్రీ నట ప్రదర్శనకు క్రిటిక్స్ మంచి మార్కులు వేసారు. భాగ్యశ్రీ ఫ్లాపులు, యావరేజుల్లో నటించినా కానీ తన నటప్రదర్శన విషయంలో నిరాశపరచలేదనే మంచి పేరు తెచ్చుకుంది.
అందుకే ఇంకా అవకాశాలొస్తూన్నాయి. ఇప్పటికీ గెలుపుపై పట్టుదలగా కనిపిస్తోంది. హోప్‌ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతం అఖిల్ అక్కినేని సరసన `లెనిన్` అనే చిత్రంలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా అయినా ఇందులో భాగ్యశ్రీ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.
భాగ్యశ్రీ ప్రస్తుతం సోషల్ మీడియాల్లో స్పీడ్ గానే ఉంది. అయితే ఈ భామ ఎప్పుడూ హద్దు మీరని, డీసెంట్ ఫోటోషూట్లతో అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా మరోసారి అలాంటి ఒక ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈసారి పింక్ అండ్ క్రీమ్ కలర్ లెహంగా ధరించి చిరునవ్వులు చిందిస్తూ అదిరిపోయే ఫోజులిచ్చింది భాగ్యశ్రీ. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. భాగ్యం ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తోందని, నేటితరంలో పద్ధతైన సొగసైన అమ్మాయి! అంటూ ఫ్యాన్స్ కితాబిచ్చేస్తున్నారు.
ఇక తన ఫోటోషూట్ కి భాగ్యశ్రీ అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. భాగ్యశ్రీ బోర్సే తాజా ఫోటోషూట్ తో ఇక నిగూఢమైన వ్యాఖ్యను షేర్ చేసింది. ``నేను పానీ పూరి తిన్నాను కాబట్టి సంతోషంగా తిరుగుతున్నాను`` అని రాసింది. దీని అర్థం తన జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటానని భాగ్యశ్రీ చెప్పకనే చెబుతోంది. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా, చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ ఆమె కెరీర్‌పై ఫోకస్ పెడుతున్నానని హింట్ ఇచ్చింది. ప్రస్తుతం భాగ్యశ్రీకి సోషల్ మీడియాలో అసాధారణ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ బ్యూటీకి ప్రేమలేఖలు రాసే కుర్రాళ్లు ఉన్నారు. అన్నట్టు యువహీరో రామ్ పోతినేనితో ప్రేమాయణం ఎంతవరకూ వచ్చిందో భాగ్యశ్రీ కనీసం క్లూ కూడా ఇవ్వడం లేదు. ఆ ఇద్దరూ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో నటించేప్పుడు ప్రేమలో పడ్డారని ప్రచారమైంది. కానీ తాజా అప్ డేట్ ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. భాగ్యశ్రీ దీనికి సరైన జవాబు చెబుతుందా లేదా? వేచి చూడాలి.