బాలయ్యతో మూవీ.. మనోజ్ ఎగ్జైట్మెంట్ ఎంతలా ఉందంటే?
సీనియర్ హీరో నటసింహ బాలకృష్ణ లీడ్ రోల్ లో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న దాదా సినిమాపై భారీ హైప్ ఉన్న విషయం తెలిసిందే.
సీనియర్ హీరో నటసింహ బాలకృష్ణ లీడ్ రోల్ లో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న దాదా సినిమాపై భారీ హైప్ ఉన్న విషయం తెలిసిందే. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి మూవీ సూపర్ హిట్ కావడంతో.. ఈసారి ఆ కాంబినేషన్ ఎలాంటి మాస్ ట్రీట్ ఇవ్వబోతుందనే అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్ కూడా ఆ అంచనాలను మరింత పెంచింది.
లేటెస్ట్ గా మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటించిన ఆస్మాన్ సినిమా టీజర్ ఈవెంట్‌కు మంచు మనోజ్ గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో హోస్ట్ ఆయన అప్ కమింగ్ సినిమాల గురించి అడిగారు. త్వరలో డేవిడ్ రెడ్డి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని మనోజ్ చెప్పారు. ఆ తర్వాత బాలయ్య దాదా ప్రస్తావన వచ్చింది. నటసింహంతో కలిసి దాదాతో వస్తానని మనోజ్ చెప్పిన మూమెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సినిమా గురించి చెప్పేటప్పుడు ఆయనలో కనిపించిన ఎగ్జైట్మెంట్ చూస్తే.. ఆ ప్రాజెక్ట్ కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్యతో సినిమా.. అందులోనూ విలన్ గా అంటే ఎగ్జైట్మెంట్ ఉండాల్సిందే అంటూ అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. ఇక దాదాలో మనోజ్ రోల్ కూడా నార్మల్ గా ఉండదనే టాక్ ఉంది. పవర్ ఫుల్ నెగెటివ్ రోల్ లో ఆయన కనిపించనున్నట్లు సమాచారం.
వైల్డ్ పోలీస్ ఆఫీసర్ గా మనోజ్ కనిపిస్తారనే ప్రచారం సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచుతోంది. ఇప్పటికే మిరాయ్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించిన మనోజ్.. ఇప్పుడు మరోసారి విలన్ టైమ్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈసారి బాలయ్యకు ఎదురుగా నిలవాల్సి ఉండటంతో రోల్ పై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మనోజ్ లుక్, బాడీ లాంగ్వేజ్, రోల్ లోని వైల్డ్ నెస్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయట.
మాస్ సినిమాలో హీరో ఎంత స్ట్రాంగ్ గా ఉంటే.. విలన్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉండాలి. ఆ ఫార్ములాను దాదాలో మలినేని గట్టిగానే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య- మనోజ్ మధ్య వచ్చే సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. అయితే బాలయ్య, మనోజ్ కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. 2012లో వచ్చిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఆ సినిమాలో మనోజ్ హీరోగా నటించగా.. బాలకృష్ణ నరసింహ రాయుడు రోల్ లో గెస్ట్ గా కనిపించారు. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత మరోసారి ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. కాకపోతే ఈసారి లెక్క మొత్తం మారింది. అప్పట్లో హీరో, గెస్ట్ రోల్ లో కనిపించిన ఆ ఇద్దరూ.. ఇప్పుడు దాదాలో సై అంటే సై అనేందుకు సిద్ధమవుతున్న వారిద్దరూ ఎంతలా మెప్పిస్తారో వేచి చూడాలి.