• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెండితెర నుంచి రగ్బీ...

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

| సినీ రంగంలో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే గాక‌ క్రీడా మైదానంలోనూ దేశం గర్వించదగ్గ రీతిలో రాణించిన నటుడు రాహుల్ బోస్ జీవిత విశేషాలను పుస్తక రూపంలోకి తీసుకురానున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-02 10:00 GMT

సినీ రంగంలో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే గాక‌ క్రీడా మైదానంలోనూ దేశం గర్వించదగ్గ రీతిలో రాణించిన నటుడు రాహుల్ బోస్ జీవిత విశేషాలను పుస్తక రూపంలోకి తీసుకురానున్నారు. మూడు దశాబ్దాలకు పైగా సినిమా ప్రయాణం.. అంతర్జాతీయ వేదికలపై రగ్బీ ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించిన అరుదైన అనుభవాలను ఆటోబయోగ్రఫీలో పొందుపరచనున్నారు. వ‌చ్చే సంవత్స‌రం ఈ పుస్తకం పాఠకుల ముందుకు రానుండటంతో ఆసక్తి నెలకొంది.

పుస్తకానికి సంబంధించిన విశేషాలను రాహుల్ బోస్ వెల్లడించారు. జీవితంలో ప్రతీ ఉన్నత శిఖరాన్ని, ఎదురైన ఒడిదుడుకులను ఈ పుస్తకం ద్వారా పంచుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని, ఇప్పటికే రెండు ప్రముఖ పబ్లిషింగ్ హౌస్‌లతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాదే ఈ పుస్తకం అధికారికంగా విడుదల కానుంది.

1980వ దశకంలో రగ్బీ యూనియన్.. బాక్సింగ్ , క్రికెట్ వంటి క్రీడలతో క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించిన రాహుల్ బోస్.. కాలక్రమేణా భారత జాతీయ రగ్బీ యూనియన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ప్రస్తుతం ఆయన రగ్బీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ క్రీడాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. ఒకవైపు క్రీడారంగంలో అంకితభావం... మరోవైపు `చమేలీ`, `ఝంకార బీట్స్` వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా సాగించిన ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం.

తాజాగా `ఉడ్తా తీర్` చిత్రంలో కనిపించి మరోసారి త‌న నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఎదురైన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా మార్చురీ సన్నివేశంలో ఊహించని విధంగా జరిగిన కొన్ని పరిణామాలు మేకింగ్‌లో అసలైన అందాన్ని తెలియజేస్తాయని అభిప్రాయపడ్డారు. ప్లాన్ చేయని కొన్ని క్షణాలు సెట్లో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని అనుభవపూర్వకంగా తెలిపారు.

ఇలా ఒక నటుడిగానే కాకుండా ఇంటర్నేషనల్ రగ్బీ ప్లేయర్‌గా, నాయకుడిగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఈ పుస్తకంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సాధారణ విజయాలకే పరిమితం కాకుండా తెర వెనుక ఎదుర్కొన్న కష్టాలు, సంతోషాలను సూక్ష్మ వివరాలతో పుస్తకంలో రాయనున్నట్లు స్పష్టం చేశారు. జీవితం అంటే ఒక్క రంగానికి పరిమితం కాదని నిరూపించిన రాహుల్ బోస్ జ్ఞాపకాల పుస్తకం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    
  • rahulbose 
  • autobiography 
  • indianrugby 
  • bollywoodactor 
  • upcomingbook 

Similar News

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

Copyright @2026

Powered by Blink CMS