ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!
| బాద్‌షా షారుఖ్ ఖాన్ నేడు 61వ పుట్టినరోజును జరుపుకుంటున్న వేళ అభిమానులకు ఓ విభిన్నమైన అనుభూతి ఎదురైంది.
బాద్‌షా షారుఖ్ ఖాన్ నేడు 61వ పుట్టినరోజును జరుపుకుంటున్న వేళ అభిమానులకు ఓ విభిన్నమైన అనుభూతి ఎదురైంది. ఏటా పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని ప్రఖ్యాత మన్నత్ బంగ్లా బాల్కనీపైకి వచ్చి వేలాది మంది అభిమానులకు అభివాదం చేయడం షారుక్ కి ఆనవాయితీ. అయితే ఈసారి మన్నత్ బంగ్లాలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులు .. ఇతర కారణాల వల్ల ఆయన సాంప్రదాయ బాల్కనీ దర్శనానికి దూరంగా ఉండాల్సి వ చ్చింది. ఈ పరిణామం అభిమానులను కొంత నిరాశపరిచినా? షారుఖ్ ఖాన్ మాత్రం వారిని నిరాశపరచకుండా అద్భుతమైన రీతిలో కృతజ్ఞతలు తెలిపారు.
మన్నత్ బంగ్లా వెలుపల భారీ సంఖ్యలో అర్ధరాత్రి నుంచి బారులు తీరిన అభిమానుల కోసం షారుఖ్ ఖాన్ ప్రత్యేకమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. బాల్కనీలో ప్రత్యక్షంగా కనిపించకపోయినా? పెద్ద స్క్రీన్లపై షారుక్ రాసిన చేతిరాత లేఖను ప్రదర్శించడం ద్వారా అభిమానులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. `మీ అందరి ప్రేమకు, శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ పంపిన ప్రేమను రెట్టింపు చేసి మీకు తిరిగి పంపిస్తున్నాను. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఎ బిగ్ హగ్` అంటూ షారుక్ తన స్వహస్తాలతో రాసిన సందేశం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ పుట్టినరోజు వేడుకలకు మరో ప్రత్యేకత కూడా తోడైంది. షారుఖ్ ఖాన్ మోస్ట్ అవేటెడ్ మూవీ అయిన `కింగ్` చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్లు, విజువల్స్ మన్నత్ పరిసర ప్రాంతాలను అలంకరించాయి. చిత్రంలో ఆయన పాత్రకు సంబంధించిన పవర్‌ఫుల్ డైలాగులు.. భారీ అగ్నిగోళాల మధ్య గన్ పట్టుకుని నడుస్తున్న పోస్టర్లు అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. బాల్కనీ అప్పియరెన్స్ లేకపోయినా? గ్రాండ్ మేకోవర్ ..ప్రత్యేక సందేశం ద్వారా కింగ్ ఖాన్ అభిమానులతో ఉన్న విడదీయరాని అనుబంధాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
గతంలో కూడా కొన్ని కారణాల వల్ల బాల్కనీ ట్రెండ్‌కు విరామాలు ఇచ్చినా? ఈసారినెలకొన్న మార్పులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నటిస్తున్న `కింగ్` సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం, నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో ఈసారి పుట్టినరోజు వేడుకల రూపురేఖలు మారాయి. అయినా? షారుక్ ను చూడటానికి వచ్చిన ప్రతి అభిమానికి చేతిరాతతో పంపిన సందేశం ద్వారా ఆయన వారిపై తనకున్న ప్రత్యేకమైన ప్రేమను చాటుకున్నారు.
సినీ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న షారుఖ్ ఖాన్ కేవలం తన సినిమాలతోనే కాకుండా అభిమానులతో కనెక్ట్ అయ్యే విధానంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ప్రత్యక్షంగా కలవలేకపోయినా? టెక్నాలజీ , సృజనాత్మకతను జోడించి ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. బాద్‌షా చూపిన ప్రేమ, వినూత్నమైన చర్యతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.