• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామాయణంపై అనవసరమైన...

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

| సాధారణ సినిమాల పైన విమర్శలు చేయడం సహజమే. కానీ కొన్ని సినిమాల కన్నా తప్పకుండా విలువ ఇవ్వాలి.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-02 11:02 GMT

సాధారణ సినిమాల పైన విమర్శలు చేయడం సహజమే. కానీ కొన్ని సినిమాల కన్నా తప్పకుండా విలువ ఇవ్వాలి. అలాంటి సినిమాలలో రామాయణం సినిమా ఒకటి. దేవుళ్ల కథతో వచ్చే చిత్రాల పైన అయినా.. కనీసం సినిమా విడుదల అయ్యేవరకు అన్నా.. వాటి పైన విమర్శలు చేయకుండా ఉండడం పద్ధతి అయిన పని అని చెప్పవచ్చు. అయితే దీన్నే ఫాలో అవ్వలేదు రాంగోపాల్ వర్మ.

రామాయణం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు రణబీర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరస్ అయ్యాయి . భారతదేశంలో 5 వేల ఏళ్ల క్రితమే ఎగిరే వాహనాలు ఉన్నాయని ఆయన చేసిన కామెంట్స్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) పరోక్షంగా సెటైర్లు వేశారు. అయితే రామాయణం వంటి గొప్ప ఇతిహాసాన్ని ఈ చర్చలోకి తీసుకురావడం అవసరమా..అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

రణబీర్ కపూర్ ఇటీవల యాంకర్ సుమతో జరిగిన ఇంటర్వ్యూలో రామాయణం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా పుష్పక విమానం గురించి ప్రస్తావిస్తూ "ఎలాన్ మస్క్ ఇప్పుడు ఫ్లయింగ్ కారును కనిపెడితే.. భారత్‌లో 5,000 ఏళ్ల క్రితమే ఎగిరే వాహనాలు ఉన్నాయి" అని అన్నారు.

రామాయణంలో రావణుడు ఉపయోగించిన పుష్పక విమానం గురించి చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ కొందరికి ఆసక్తిని కలిగించగా, మరికొందరు వాటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో RGV తనదైన శైలిలో స్పందించారు. పుష్పక విమానంతో ప్రారంభించి ఇప్పుడు దేశంలో తొలి ఎయిర్‌లైన్స్ దగ్గరకు వచ్చామంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ సెటైర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

RGV వ్యాఖ్యలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆయన హాస్యాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు రామాయణంపై అనవసరంగా సెటైర్లు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. కొంతమంది అయితే ఆయనను "రావణ్ గోపాల్ వర్మ" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే రామాయణం అనేది కేవలం ఒక కథ మాత్రమే కాదు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మం, విలువలతో ముడిపడి ఉన్న గొప్ప ఇతిహాసం. అందులోని పాత్రలు, సంఘటనలు తరతరాలుగా ప్రజలకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాయి.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటులు తమ అభిప్రాయాలను పంచుకోవడం సహజమే. వాటిపై విమర్శలు చేయడం కూడా తప్పు కాదు. కానీ ప్రతి విషయాన్ని వ్యంగ్యంగా మార్చడం అవసరమా.. అనేది ప్రస్తుతం చాలామంది రాంగోపాల్ వర్మ కి వేస్తున్న ప్రశ్న. మరి మళ్లీ దీనిపైన కూడా ఈ దర్శకుడు స్పందిస్తారా లేదా చూడాలి.

Tags:    
  • ramayana 
  • ramgopalvarma 
  • ranbirkapoor 
  • pushpakavimanam 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS