సీక్వెల్స్ తీయడం లో రాజమౌళి, సుకుమార్ సక్సెస్ అయ్యారు... మిగతా వారు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే...

కానీ రాజమౌళి మాత్రం రెండు పార్ట్ లతో విజయాలను అందుకొని చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇక అదే బాటలో నడిచిన సుకుమార్ సైతం పుష్ప, పుష్ప2 సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు.

Update: 2026-09-16 11:30 GMT

ఒక సక్సెస్ ఫుల్ సినిమాను చేయడానికి దర్శకుడు ఎంతలా కష్టపడుతాడో చాలా మందికి తెలియదు. థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ మూడు గంటల సినిమాను చూసి అది హిట్టా ఫట్టా అని తేల్చేస్తారు. కానీ దాని వెనుక దర్శకుడి జీవితం ఉంటుంది, ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు ఉంటాయి, ఆర్టిస్టుల భవిష్యత్తు ఉంటుంది. అందుకే ఒక సక్సెస్ ఫుల్ సినిమాను తీయగలిగే దర్శకుడికి ఇండస్ట్రీ లో గొప్ప గుర్తింపు ఉంటుంది... ప్రతి ఒక్క టెక్నీషియన్ సైతం ఒక్క సక్సెస్ వస్తే చాలు లైఫ్ మారిపోతుందనే ఆశతో ఎదురు చూస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే ఇంతమంది కెరియర్లు కేవలం దర్శకుడి చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఆయన ఎంత జాగ్రత్తగా సినిమాను చేయాల్సి ఉంటుందో ఆయన మీద ఎంత ప్రేజర్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు... రాజమౌళి లాంటి దర్శకుడు వీటన్నింటికి కట్టుబడి ఉంటాడు కాబట్టే ఆయన చేసిన ప్రతి సినిమాతో సక్సెస్ ను సాధిస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క ఖ్యాతిని ప్రపంచం నలుమూలాల విస్తరింపజేసిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. 'బాహుబలి' మొదటి పార్ట్ తో సూపర్ సక్సెస్ సాధించిన ఆయన ఆ తర్వాత చేసిన 'బాహుబలి 2' మూవీ తో పాన్ ఇండియా ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టాడు... అప్పటివరకు ఎవ్వరు సీక్వెల్ సినిమాలతో సక్సెస్ లను సాధించలేదు. కానీ రాజమౌళి మాత్రం రెండు పార్ట్ లతో విజయాలను అందుకొని చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇక అదే బాటలో నడిచిన సుకుమార్ సైతం పుష్ప, పుష్ప2 సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు.

సీక్వెల్ సినిమాలను సక్సెస్ చేయడంలో ఈ ఇద్దరు దర్శకులు మాత్రమే సూపర్ సక్సెస్ అయ్యారు. మిగతా తెలుగు దర్శకులు మాత్రం తడబడ్డారు. వాళ్ళు సీక్వెల్ సినిమాలని ఎందుకు సక్సెస్ చేయలేకపోతున్నారనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది... సురేందర్ రెడ్డి చేసిన 'కిక్' సినిమా సూపర్ హిట్ అయింది కానీ కిక్ 2 ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన 'గబ్బర్ సింగ్' సూపర్ సక్సెస్ అవ్వగా, గబ్బర్ సింగ్ 2 ఆశించిన మేరకు ఆడలేదు. 'మన్మధుడు' క్లాసికల్ సినిమాల లిస్టులో నిలిచిపోయింది. కానీ మన్మధుడు 2 సినిమా డిజాస్టర్ అయింది. చిరంజీవి హీరోగా చేసిన 'శంకర్ దాదా ఎంబిబిఎస్' సినిమా మంచి విజయాన్ని సాధించి చిరంజీవికి నటుడిగా మంచి గుర్తింపు దక్కింది. కానీ శంకర్ దాదా జిందాబాద్ సినిమా మాత్రం ఆశించిన మేరకు సక్సెస్ అవ్వలేదు... ఇలా చెప్పుకుంటూ పోతే ప్లాప్ అయిన సీక్వెల్ సినిమాలు చాలానే ఉన్నాయి...

సీక్వెల్ సినిమాలను తీయడంలో రాజమౌళి, సుకుమార్ లకు వర్కౌట్ అయిన స్ట్రాటజీ మిగతా దర్శకులకు ఎందుకు సెట్ అవ్వడం లేదంటే మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అయిన తర్వాత సీక్వెల్ మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సీక్వెల్ సినిమాల్లో ఎలాంటి కథ ఉండాలి అనేది ఒకటి రెండు సార్లు పకడ్బందిగా ప్లాన్ చేసుకోవాలి. మొదటి పార్ట్ లో ఏం చూపించాం ఈ మూవీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ప్రేక్షకుడికి హై ఫీల్ కలుగుతుందనే విషయాల మీద చాలావరకు కసరత్తులను చేయాలి. ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకొవాలి. రైటింగ్ సమయంలోనే సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా రాసుకోవాలి. మొదటి పార్ట్ అద్భుతమైన సక్సెస్ ని సాధించింది కాబట్టి దానికి మించిన అంచనాలు సెకండ్ పార్ట్ మీద ఉంటాయి.

వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకుడి మైండ్ సెట్ ఆధారంగా సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపే ప్రయత్నం చేయాలి. మొదటి పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ లో ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసే విధంగా సన్నివేశాలను రాసుకున్నప్పుడు మాత్రమే ఫస్ట్ పార్ట్ ను మించి సెకండ్ పార్ట్ హైలైట్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం ఫస్ట్ పార్ట్ కి వచ్చిన క్రేజ్ ని వాడుకుంటూ ఏదో నాసిరకపు కథలతో సినిమాలను చేద్దాం అనుకుంటే సీక్వెల్స్ వర్కౌట్ అవ్వవు. ఇక సీక్వెల్ మూవీస్ ప్లాప్ అయితే మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ కూడా పోతుంది. అందుకే సీక్వెల్స్ విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించినపుడు మాత్రమే సక్సెసులు దక్కుతాయి...

Tags:    

Similar News