ఎన్టీఆర్ క్రేజీ కాంబో.. వెయిటింగ్ లిస్ట్ ఇంకా పెరిగిందా?

సౌత్ ఇండియన్ సినిమాలో ఇప్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఒక్క స్టార్ హీరో ఉంటేనే థియేటర్లు దద్దరిల్లేవి, కానీ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.;

Update: 2026-02-03 06:05 GMT

సౌత్ ఇండియన్ సినిమాలో ఇప్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఒక్క స్టార్ హీరో ఉంటేనే థియేటర్లు దద్దరిల్లేవి, కానీ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా 'జైలర్' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ క్రియేట్ చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయారు. ఆయన తన తర్వాతి ప్రాజెక్టులను ఎవరితో ప్లాన్ చేస్తున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్.

నెల్సన్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నారనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాస్ ఎలిమెంట్స్ ను డార్క్ కామెడీతో మిక్స్ చేయడంలో నెల్సన్ స్టైలే వేరు, ఇక తారక్ లాంటి పర్ఫార్మర్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా కనిపించడం లేదు. దీని వెనుక కొన్ని పెద్ద కారణాలే ఉన్నాయని తెలుస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. నెల్సన్ లైనప్‌లో ఇప్పుడు ఇద్దరు లెజెండరీ హీరోల మల్టీస్టారర్ మూవీ వచ్చి చేరింది. రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్‌లో నెల్సన్ ఒక భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 'జైలర్ 2' పూర్తి చేసిన వెంటనే ఈ లెజెండరీ మూవీ పట్టాలెక్కనుంది. ఈ భారీ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. దీనివల్ల నెల్సన్ ఎన్టీఆర్ సినిమా 2028 నాటికి గానీ మొదలయ్యే ఛాన్స్ లేదని సినీ వర్గాల టాక్.

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి మరో ఏడాది పడుతుంది. అలాగే మరో సినిమా కూడా లైన్ లో పెట్టె అవకాశం ఉంది. దేవర 2 రావచ్చని కూడా ఇదివరకే నిర్మాత హింట్ ఇచ్చారు. అటు నెల్సన్ కూడా రజనీ, కమల్ వంటి పెద్ద స్టార్లతో వర్క్ చేయాల్సి ఉండటంతో కాల్షీట్లు సర్దుబాటు చేయడం సవాల్‌గా మారింది. అంటే నెల్సన్ మార్క్ డార్క్ యాక్షన్ డ్రామాలో తారక్ ను చూడాలంటే అభిమానులు మరికొంత కాలం ఓపిక పట్టక తప్పదు. ఈ గ్యాప్‌లో తారక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలను ఓకే చేసే అవకాశం కూడా ఉంది.

సాధారణంగా పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ అయినప్పుడు అవి పట్టాలెక్కడానికి రకరకాల సమీకరణాలు మారుతుంటాయి. నెల్సన్ ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే సినిమాలో కనిపిస్తున్నారంటే అది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక సెన్సేషన్ అవుతుంది. అందుకే నెల్సన్ తన పూర్తి ఫోకస్ ఆ ప్రాజెక్టుపైనే పెట్టబోతున్నారు. ఆ తర్వాతే ఎన్టీఆర్ తో ఉండే సినిమా గురించి పూర్తి స్థాయి పనులు మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.

2028 అంటే చాలా పెద్ద వెయిటింగ్ లిస్టే అని చెప్పొచ్చు. అప్పటికి ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, అలాగే నెల్సన్ కూడా మరిన్ని హిట్స్ తో దూసుకుపోయే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా, ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తుంటే ఇది కాస్త ఆలస్యమయ్యే ప్రాజెక్టులానే కనిపిస్తోంది.

Tags:    

Similar News