12:12 ఏం జరగబోతోంది?
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రియలిస్టిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్`. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్‌గా సరికొత్త చర్చకు తెరలేపింది.;
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రియలిస్టిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్`. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్‌గా సరికొత్త చర్చకు తెరలేపింది. దాయాది దేశం పాకిస్థాన్ ఇండియాపై ఎలాంటి కుట్రలకు తెరలేపింది?..ఎలాంటి దుర్గాలని ప్లాన్ చేసింది?.. ఎంత మంది అమాయకుల్ని టెర్రిరిస్ట్‌ల కారణంగా బలితీసుకుంది? దానికి ల్యారీలోని గ్యాంగ్ స్టర్స్ ఎలా సపోర్ట్ చేశారు?..అలాంటి వారికి వారి పద్దతిలోనే బుద్ది చెప్పాలని మన రా ఏజెన్సీ ఎలాంటి ప్లాన్‌ని అమలు చేసింది? ఎలా వారి ఆటలు కట్టించింది?
అనే ఆసక్తికరమైన అంశాల మేళవింపుతో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని అత్యంత రియలిస్టిక్‌గా దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించాడు. కొంత మంది విమర్శలు గుప్పించి పాక్‌కు సపోర్ట్‌గా ప్రచారం చేసినా అత్యధిక భాగం ప్రేక్షకులు, మేధావులు, సెలబ్రిటీలు `ధురంధర్`పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో సినిమాకు ఊహించని మౌత్ పబ్లిసిటీ లభించి టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. దీంతో ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా `ధురంధర్`..ధురంధర్.. అంతా ముక్తకంఠంతో `ధురంధర్`కు చీర్స్ చెప్పడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.
దీంతో దీనికి సీక్వెల్‌గా రానున్న `ధురంధర్ 2:ది రివేంజ్`పై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా ఊహించని విధంగా ఉంటుందని, ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయే విషయాలని పార్ట్ 2లో దర్శకుడు ఆదిత్యధర్ చూపించబోతున్నాడని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే టీజర్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. టీజర్‌కు సెన్సార్ వారు `ఏ` సర్టిఫికెట్ ఇచ్చారంటే ఏ స్థాయిలో బ్లాడ్ బాత్ జరిగిఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఆసక్తికరమైన అప్ డేట్‌ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ మంగళవారం మధ్యాహ్నం 12:12 నిమిషాలకు సర్‌ప్రైజ్ రాబోతోందంటూ ప్రకటించింది. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్‌లో 12:12 అంటూ ఓ పిక్‌ని షేర్ చేసి అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. అయితే రణ్‌వీర్ సింగ్ మాత్రం ఐదు భాషల్లో `ధురంధర్ 2:ది రివేంజ్` పోస్టర్‌ని షేర్ చేస్తూ దానికి `చెడిపోవడానికి సమయం వచ్చింది` అనే క్యాప్షన్‌ని జోడించి ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేశాడు.
మంగళవారం మధ్యాహ్నం 12:12 నిమిషాలకు ఈ మూవీ నుంచి సర్‌ప్రైజ్ అంటూ టీమ్ అంతా హడావిడి చేస్తున్నారంటే టీజర్ రిలీజ్ కోసమని స్ఫష్టమవుతోంది. సినిమాని మార్చి 19న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌కు టైమ్ తక్కువ ఉంది కాబట్టి టీమ్ టీజర్‌తో ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తోంది. పార్ట్ 2లోనూ అక్షయ్‌ఖన్నా కనిపిస్తాడట. అయితే అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని తెలుస్తోంది. ఇక మిగతా కీలక పాత్రల్లో సారా అర్జున్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కనిపించనున్నారు.