రాశీ ఖ‌న్నా: కొంచెం రాజరికం.. కొంచెం నిశ్శబ్దం

ప్ర‌స్తుతం ఉత్త‌రాది ద‌క్షిణాది సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ, తెలివిగా ఆటాడుతోంది అందాల రాశీ ఖ‌న్నా. ఈ దిల్లీ బ్యూటీ ఓవైపు ముంబైని మ్యానేజ్ చేస్తూనే, హైద‌రాబాద్ ని త‌న సొంత ఇల్లుగా మార్చుకుంది.;

Update: 2026-02-03 03:50 GMT

ప్ర‌స్తుతం ఉత్త‌రాది ద‌క్షిణాది సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ, తెలివిగా ఆటాడుతోంది అందాల రాశీ ఖ‌న్నా. ఈ దిల్లీ బ్యూటీ ఓవైపు ముంబైని మ్యానేజ్ చేస్తూనే, హైద‌రాబాద్ ని త‌న సొంత ఇల్లుగా మార్చుకుంది. మ‌రోవైపు చెన్నై ప‌రిశ్ర‌మ‌లోను రాశీ పేరు మార్మోగుతోంది. ఏక కాలంలో తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల‌లో న‌టిస్తున్న ఈ బ్యూటీ కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసుకోనంత బిజీగా ఉంది. ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను ప్రాజెక్టుల‌తో రాశీ బిజీ బిజీగా ఉంది. ఇటీవ‌ల అనీష్ బ‌జ్మి లాంటి టాప్ డైరెక్ట‌ర్ సినిమాకి సంత‌కం చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి.




రాశీ ఖన్నా న‌టిస్తున్న వ‌రుస‌ చిత్రాల వివ‌రాల్లోకి వెళితే.. మొద‌టిసారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న ఈ బ్యూటీ అవ‌కాశం అందుకుంది. ప‌వ‌ర్‌స్టార్ స‌ర‌స‌న‌ హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` చిత్రంలో శ్లోక అనే ఔత్సాహిక ఫోటోగ్రాఫ‌ర్ గా క‌నిపించ‌నుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇది ఏప్రిల్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. మ‌రోవైపు `తలాఖోన్ మే ఏక్` అనే చిత్రంలో న‌టిస్తోంది. విక్రాంత్ మాస్సేతో రాశీకి ఇది రెండో చిత్రం. ఇది ఒక గ్రిప్పింగ్ డ్రామాగా రూపొందుతోంది. ఆర్. మాధవన్, సోహా అలీ ఖాన్‌లతో కలిసి రాశీ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ `బ్రిడ్జ్` యూకే నేపథ్యంలో ర‌క్తి క‌ట్టించ‌నుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అక్షయ్ కుమార్, విద్యాబాలన్‌లతో కలిసి అనీస్ బ‌జ్మి రూపొందించ‌నున్న కామెడీ ఎంటర్‌టైనర్‌లోను రాశీ న‌టించ‌నుంది. షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. రాజ్ అండ్ డీకే `ఫర్జీ 2` వెబ్ సిరీస్ లోను రాశీ న‌టించ‌నుంది. మొద‌టి భాగంలో న‌టించిన‌ షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి త‌దిత‌రులు ఇందులో న‌టిస్తున్నారు. అలాగే `రౌడీ అండ్ కో` అనే త‌మిళ చిత్రంలోను రాశీ న‌టించ‌నుంది.




కెరీర్ ప‌రంగా వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్న రాశీ త‌న అభిమానుల కోసం సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ట‌చ్ లో ఉంది. రాశీ ఖ‌న్నా ఫ్యాషన్ ప్రపంచంలోను రాణిగా మెరిసిపోతోంది. కేవలం నటనతోనే కాదు తన అద్భుతమైన స్టైల్ కంటెంట్‌తోను మ‌తులు చెడ‌గొడుతోంది. ఫ్యాషన్ ఐకాన్‌గా సాటి యువ‌నాయిక‌ల‌కు గ‌ట్టి పోటీనిస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఏ లిటిల్ రాయ‌ల్, ఏ లిటిల్ క్వైట్..( రాశీ ఖ‌న్నా: కొంచెం రాజరికం.. కొంచెం నిశ్శబ్దం) అనే క్యాప్షన్‌తో రాశీ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి.

దీనికి `వి-వాని బై వాని వాట్స్` డిజైన్ చేసిన చీరలో దేవకన్యలా మెరిసిపోతోంది. ఈ అద్భుతమైన లుక్ వెనుక షారా అష్రఫ్ ప్రయాగ్ మిశ్రా స్టైలింగ్, సారంగ్ గుప్త ఫోటోగ్రఫీ కీలక పాత్ర పోషించారు.

రాశీ ఖన్నా ఎంపిక చేసుకునే డిజైన‌ర్ దుస్తులు ఎప్పుడూ ట్రెండీగా, క్లాసీగా మురిపిస్తున్నాయి. త‌నదైన యూనిక్ ఫ్యాష‌న్ సెన్స్ తో ఇప్ప‌టికే యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. సంప్రదాయ చీరకట్టు అయినా, వెస్ట్రన్ దుస్తులు అయినా రాశీ ఎంతో హుందాగా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకుంటుందని తాజా లుక్ చెబుతోంది.

Tags:    

Similar News