ప్ర‌భాస్ సినిమాతో పోల్చొద్దంటున్నాడు!

అయినా స‌రే ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డో ఒక అనుమానం ర‌గులుతూనే ఉంది. దీనిపై న‌టుడు అరుణ్ గోవిల్ తాజాగా స్పందించారు.;

Update: 2026-02-03 02:30 GMT

ఇండియ‌న్ సినిమాల్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న బాలీవుడ్ మూవీ `రామాయ‌ణ‌`. నితేష్ తివారీ భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమాని న‌మిత్ మ‌ల్హోత్రాతో క‌లిసి రాకింగ్ స్టార్ య‌ష్ నిర్మిస్తున్నారు. ర‌ణ్‌బీర్ క‌పూర్‌, సాయి ప‌ల్ల‌వి సీతారాములుగా, య‌ష్ రావ‌ణ బ్ర‌హ్మ‌గా న‌టిస్తున్న ఈ మైథ‌లాజిక‌ల్ డ్రామాలో ఎంతో మంది కీల‌క న‌టీన‌టులు న‌టిస్తున్నారు. హ‌ను మంతుడిగా స‌న్నీ డియోల్‌, కైకేయిగా లారా ద‌త్తా, శూర్ప‌న‌ఖ‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ద‌శ‌ర‌థుడిగా అరుణ్ గోవిల్‌, మండోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, కైక‌సిగా శోభ‌న త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ద‌గ్గ‌రి నుంచే దీనిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత వ‌ర‌కు రామాయ‌ణ ఇతిహాస గాధ‌పై ఎన్నో సినిమాలొచ్చాయి. దీంతో మేక‌ర్స్‌కి, డైరెక్ట‌ర్‌కి `రామాయ‌ణ‌` ఓ స‌వాల్‌గా మారింది. 2023లో ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా, కృతిస‌న‌న్ సీత‌గా రూపొందిన `ఆదిపురుష్‌` ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు గురైందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. రాముడిగా ప్ర‌భాస్ పాత్ర‌ని మ‌లిచిన తీరు నుంచి రావ‌ణుడు, హ‌నుమంతుడి పాత్ర‌ల మేకోవ‌ర్‌, వారి మ‌ధ్య సాగే సంభాష‌ణ‌ల‌పై కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

దీనిపై టీమ్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌గా, తెలుగులో రిలీజ్ చేసిన పీపుల్ మీడియా వారు మోడ్ర‌న్ రామాయ‌ణం అంటూ స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేసి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ కార‌ణంగా నితీష్ తివారీ తెర‌కెక్కిస్తున్న `రామాయ‌ణ‌`పై అంద‌రిలోనూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఈ మూవీని 3డీలో అంటునా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో అత్యంత ఆధునిక టెక్నాల‌జీ స‌హాయంతో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. మేక‌ర్స్ రిలీజ్ చేసిన వీడియోలోని విజువ‌ల్స్ ప‌లువురి అనుమానాల‌కు ఫుల్ స్టాప్ పెట్టింది.

అయినా స‌రే ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డో ఒక అనుమానం ర‌గులుతూనే ఉంది. దీనిపై న‌టుడు అరుణ్ గోవిల్ తాజాగా స్పందించారు. ఇందులో అరుణ్ గోవిల్ ద‌శ‌ర‌థ మ‌హారాజుగా రాముడి తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఏదైనా సినిమావ‌స్తోందంటే ప్రేక్ష‌కులు దాన్ని పోల్చ‌డానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. మ‌నం దేవుడి పాత్ర పోషిస్తున్న‌ప్పుడు చూడ‌గానే అలానే క‌నిపించాల‌ని భావిస్తారు. లుక్స్ చాలా ముఖ్యం. ఆడియ‌న్స్ తెర‌పై మ‌న‌ల్ని చూడ‌రు. మ‌న పాత్ర‌లో ఉన్న దేవుడిని చూస్తారు.

బ‌హుషా దేవుడు నిజంగా ఇలాగే ఉంటాడేమో అని అనుకోవాలి. అంత‌లా మ‌నం ప్రేక్ష‌కుల‌ని ప్ర‌భావితం చేయాలి` అన్నారు. ఇక ఈ మూవీని `ఆదిపురుష్‌`తో పోల్చొద్ద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజ్ఞ‌ప్తి చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆదిపురుష్‌` మూవీని రామాయ‌ణంలోని సీతాప‌హ‌ర‌ణం ఘ‌ట్టం నేప‌థ్యంలో రూపొందించారు. అయితే ఇందులో గ్రాఫిక్స్ పేరుతో చేసిన నాసిర‌కం జిమ్మిక్కులు, రావ‌ణుడిగా సైఫ్ అలీఖాన్‌ని చూపించిన తీరు, హ‌నుమంతుడితో చెప్పించిన మాస్ డైలాగ్‌లు విమ‌ర్శ‌ల‌కు తెర‌తీశాయి. దీంతో రామాయ‌ణం అంటే `ఆదిపురుష్‌`లా భావించొద్ద‌ని అరుణ్ గోవిల్ విజ్ఞ‌ప్తి చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News