ముంబైలో పూరి..గుడ్డ‌లూడ‌దీసి మ‌రీ!

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెరకెక్కు తోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-09-02 16:30 GMT

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెరకెక్కు తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్త‌యింది. చెన్నైలో మొద‌లైన షూట్ ఇప్పుడు ముంబైకి చేరింది. ప్ర‌స్తుతం ముంబైలో కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. దీనిలో భాగంగా పూరి అండ్ కో ముంబై అంతా చుట్టేస్తున్నారు. విజయ్ సేతుప‌తి స‌హా ప్ర‌ధాన తార‌గ‌ణంపై యాక్ష‌న్ స‌న్ని వేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఓ భారీ గ్యాంగ్ ను విజ‌య్ సేతుప‌తి త‌రిమే స‌న్నివేశాల‌గా తెలిసింది.

ష‌ర్ట్ లేకుండా సీన్ లోకి:

ఈ యాక్షన్ స‌న్నివేశానికి ఓ ప్రత్యేక‌త ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈసీన్ లో పాల్గొన్న ఫైట‌ర్లు అంతా ఎలాంటి ష‌ర్స్ట్ ధ‌రించ కుండా ఈ సీన్ లో పాల్గొంటున్నారుట‌. పూరి అండ్ స్టంట్ మాస్ట‌ర్ ఆదేశాల మేర‌కు యాక్ష‌న్ స‌న్నివేశాన్ని ఆ ర‌కంగా డిజైన్ చేసారుట‌. చొక్కా విప్పే సీన్ లో మ‌క్క‌ల్ సెల్వ‌న్ కూడా క‌నిపిస్తాడ‌ని చెబు తున్నారు. గ్యాంగ్ రోడ్డు మీద ప‌రిగెడుతుండ‌గా వాళ్ల‌ను త‌రుముతూ విజ‌య్ సేతుప‌తి చేసే యాక్ష‌న్ సీన్ గా తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే ఇలా చొక్కా విప్పే సీన్ చేయ‌డం విజ‌య్ సేతుప‌తికి రెండ‌వ‌సారి అవుతుంది.

గ‌తంలో ఆ సినిమాలో:

లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన `విక్ర‌మ్` లోనూ చొక్కా విప్పిన సీన్లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ సేతుప‌తి ఎంట్రీనే ఆ సీన్ తో మొద‌ల‌వుతుంది. వీపు భాగంలో ఓ పాము టాటూతో క‌నిపిస్తాడు అందులో. సినిమాలో ఆ సీన్ బాగా పండింది. మాస్ కి బాగా క‌నెక్ట్ అయింది. పూరి కూడా మాస్ స్పెష‌లిస్ట్. హీరో పాత్ర ను ఎలివేట్ చేయ‌డం పూరి మార్క్ క‌నిపిస్తుంది. మ‌రి విజ‌య్ సేతుప‌తిని ఎంత క్రియేటివ్ గా చూపి స్తాడో చూడాలి. ఈ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వ‌ర‌గానే ముగించాల‌నే ప్ర‌ణాళిక‌తో ప‌ని చేస్తున్నాడు.

మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తిలోనేనా:

వరుస ప‌రాజ‌యాల నేప‌థ్యంలో ఇక‌పై షూటింగ్ లు నెమ్మ‌దిగా చేస్తాన‌ని ఆ మ‌ధ్య అన్నారు. అన్న‌ట్లుగానే `డ‌బుల్ ఇస్మార్ట్ శంక‌ర్` నెమ్మ‌దిగా పూర్తి చేసారు. షూటింగ్ మొద‌లైన నాటి నుంచి రిలీజ్ వ‌ర‌కూ చాలా స‌మ‌యం తీసుకున్నారు. ఇంత ఎఫెర్ట్ పెట్టినా? ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయిన‌ సంగ‌తి తెలి సిందే. దీంతో పూరి మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తిలోనే కొత్త సినిమా పూర్తి చేస్తార‌నే వార్త‌లొచ్చాయి. అందుకు తగ్గ‌ట్టే పూరి కొత్త ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నారు.

Tags:    

Similar News