జిమ్ క‌స‌ర‌త్తుల‌కు మించిన‌ది క‌నిపెట్టిన గ్రీక్ గాడ్

మెలి తిరిగిన కండ‌లు, తీరైన దేహదారుఢ్యంతో యువ‌త‌రం మ‌తులు చెడ‌గొట్ట‌డంలో ఎప్పుడూ ముందుంటాడు హృతిక్ రోష‌న్.;

Update: 2025-12-19 03:00 GMT

మెలి తిరిగిన కండ‌లు, తీరైన దేహదారుఢ్యంతో యువ‌త‌రం మ‌తులు చెడ‌గొట్ట‌డంలో ఎప్పుడూ ముందుంటాడు హృతిక్ రోష‌న్. గ్రీక్ గాడ్ గా సుప్ర‌సిద్ధుడైన హృతిక్ త‌న జీవితంలో, కెరీర్ లో చాలా దూరం వ‌చ్చాడు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌లో అత‌డు గురువుగా ఎదిగాడు. ఇప్పుడు అత‌డికి జిమ్ కొత్త కాదు. వ్యాయామం చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ అత‌డు జిమ్, క‌స‌ర‌త్తుల‌ను మించి ఇంకేదో క‌నిపెట్టే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు.

అత‌డు ఎత్త‌యిన కొండ‌లు- కోన‌లు, ప‌ర్వ‌తాల‌ను ఎక్కుతున్నాడు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో ట్రెక్కింగ్ యాత్రకు బయలుదేరి ప్రకృతి ఒడిలో శాంతియుత పునరుజ్జీవనం పొందుతున్నాడు. స్పాట్ నుంచి కొన్ని ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి. పచ్చని పర్వతాలు, నిర్మలమైన ప్రకృతి దృశ్యాలతో ఆ ప్రాంతం ఎంతో అందంగా ఉంది. ఈ ఫోటోలు వేగంగా వైరల్ అయ్యాయి. అభిమానులు మీమ్‌ఫెస్ట్ తో ఉత్సాహాన్ని క‌న‌బ‌రిచారు. `కోయి మిల్ గయా` నుండి జాదు కోసం చూస్తున్నారా? అని అడిగారు.

ఈ ఫోటోల‌తో పాటు అంద‌మైన క్యాప్ష‌న్ ని ఇచ్చాడు హృతిక్. ఎగుడుదిగుడు ఉపరితలాలపై ట్రెక్కింగ్ చేయడం గురించి ఏదో నా హృదయాన్ని ఆనందంతో నవ్విస్తుంది. పాపం నా కాళ్ళ కింద ఉండాల్సినది...`` అంటూ ఎగ్జ‌యిట్ అయ్యాడు. సహజ మార్గాల్లో న‌డ‌క‌ల‌తో భూమితో తిరిగి కనెక్ట్ అవ్వడంలో అత‌డు ఏదో సులువైన మార్గం క‌నుగొన్న ఆనందంలో ఉన్నాడు. హృతిక్ ఫిట్‌నెస్‌ని, అత‌డి తత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.. జిమ్ వ్యాయామాలకు మించి, బుద్ధిపూర్వక జీవనం, ఓపెన్ అడ్వెంచ‌ర్ కి విస్తరించింది అని రాసారు.

హృతిక్ పూర్తి ట్రెక్కింగ్ గేర్ ధరించి ప‌సుపు రంగు జాకెట్, టోపీ .. దృఢమైన బ్యాక్‌ప్యాక్ ధరించి కనిపించాడు. ప్రశాంతమైన ముఖంతో అథ్లెటిక్ నడకల‌తో అత‌డు ప్ర‌త్యేకంగా క‌నిపించాడు. ప్ర‌కృతిలో అత‌డు లీన‌మై ఆరాధ‌న‌గా క‌నిపిస్తున్నాడు. ఈ ఫోటోలను చూడ‌గానే.. `జాదు మిలా క్యా?` అని కొంద‌రు నెటిజ‌నులు రాసారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంట‌నే ఫ్యాన్స్ విరుచుకుప‌డ్డారు. అభిమానులలో ఒకరు తన చిత్రం కోయి మిల్ గయా లోని నీలిరంగు గ్రహాంతరవాసిని ప్రస్తావిస్తూ ``జాదు మిలా క్యా వహా`` అని ప్ర‌శ్నించారు. మరొక అభిమాని `జాదు మిల్ గయా క్యా?` అని రాసారు. ఇది ఈ ఫోటోల‌కు వ‌చ్చిన అద్భుత స్పంద‌న‌.

హృతిక్ ప్ర‌స్తుతం క్రిష్ 4 కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేందుకు సిద్ధ‌మవుతున్నాడు. అదే స‌మ‌యంలో అత‌డు ఓటీటీలోకి ఆరంగేట్రం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సిరీస్ కి అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వం వహిస్తారు.

Tags:    

Similar News