చిరంజీవి గురించి మీకేం తెలుసు? లావ‌ణ్య స్ట్రాంగ్ కౌంట‌ర్

ఇప్పుడు మెగా ఫ్యామిలీలో క‌లుగుతున్న ఆనందానికి అవ‌ధుల్లేవు. మెగా దంప‌తులు రామ్ చ‌ర‌ణ్- ఉపాస‌న మ‌రోసారి త‌ల్లిదండ్రుల‌వ‌డంతో వారి ఇంట ఆనందం రెట్టింపైంది.;

Update: 2026-02-04 09:57 GMT

ఇప్పుడు మెగా ఫ్యామిలీలో క‌లుగుతున్న ఆనందానికి అవ‌ధుల్లేవు. మెగా దంప‌తులు రామ్ చ‌ర‌ణ్- ఉపాస‌న మ‌రోసారి త‌ల్లిదండ్రుల‌వ‌డంతో వారి ఇంట ఆనందం రెట్టింపైంది. ఈ దంపతుల‌కు జ‌న‌వ‌రి 31 నాడు క‌వ‌ల‌లు జ‌న్మించిన విష‌యం తెలిసిందే. ఆ క‌వ‌ల‌ల్లో ఒక బాబు, ఒక పాప ఉండ‌టంతో మెగా ఫ్యామిలీతో పాటూ వారి అభిమానులు కూడా తెగ సంతోషిస్తున్నారు.

రెట్టింపైన ఆనందం

ఆల్రెడీ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌కు క్లీంకార అనే పాప ఉంది. ఇప్పుడు ఒక బాబు, పాప జ‌న్మించారు. దీంతో మ‌రోసారి తాత అయినందుకు చిరంజీవికి, చ‌ర‌ణ్-ఉపాస‌న దంప‌తుల‌కు ప‌లువురు సెల‌బ్రిటీలు, ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అంతేకాదు, క‌వ‌ల‌ల రాక‌తో ఆనందం రెట్టింప‌వ‌డంతో ఫ్యాన్స్ దీన్నొక పండ‌గ‌లా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

వార‌సుడి విష‌యంలో చిరంజీవిపై విమ‌ర్శ‌లు

మెగా ఫ్యామిలీలోకి వార‌సుడు రావ‌డంతో గ‌తంలో వార‌సుడి విష‌యంలో చిరంజీవి చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తూ ఆయ‌న్ని ఓ వర్గం నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట చిరంజీవిపై వ‌స్తున్న నెగిటివ్ కామెంట్స్ కు మెగా కుటుంబ కోడ‌లు, టాలీవుడ్ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీకి వారసుడు రావ‌డంపై ఓ జ‌ర్న‌లిస్ట్ నెగిటివ్ కామెంట్ చేయ‌డం చూసి, కొంద‌రు చిరంజీవిని ట్రోల్ చేయడం మొద‌లుపెట్టారు.

జ‌ర్న‌లిస్టుకి లావణ్య కౌంట‌ర్

ఆ జ‌ర్న‌లిస్టు ట్వీట్ కు లావ‌ణ్య కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చారు. సాధార‌ణంగా తాను ఇలాంటి ట్వీట్స్ ను పట్టించుకోన‌ని, కానీ ఇలాంటివి ఓ జ‌ర్న‌లిస్ట్ నుంచి తాను ఊహించ‌లేద‌ని, మీ ట్వీట్ తో ఓ సంతోష‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని చెడ‌గొట్టార‌ని, చిరంజీవి త‌న ఫ్యామిలీలోని మ‌హిళ‌ల‌కు ఎంత గౌర‌వ‌మిస్తార‌నేది మీకు తెలియ‌ద‌ని, ఆయ‌న చేసే దానిలో మిగ‌తా వాళ్లు 1% కూడా చేయ‌ర‌ని, తెలియ‌ని వారి గురించి కామెంట్ చేయ‌క‌పోవ‌డం బెట‌ర్ అని లావ‌ణ్య పోస్ట్ చేశారు. దీంతో స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ ఆ ట్వీట్ ను త‌న ఖాతా నుంచి తొల‌గించారు.

మెగాస్టార్ కు ఆడ‌వాళ్ల‌పై ప్ర‌త్యేక గౌర‌వం

లావ‌ణ్య చెప్పిన‌ట్టు చిరంజీవి ఆడ‌వారికి, మ‌రీ ముఖ్యంగా త‌న ఫ్యామిలీలోని ఆడ‌వాళ్ల‌ను ఎంత‌గా గౌర‌విస్తారో అంద‌రికీ తెలిసిందే. త‌న త‌ల్లి నుంచి భార్య‌, చెల్లెల్లు, పిల్ల‌లు, మ‌న‌వ‌రాళ్లు అంద‌రినీ చిరంజీవి ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు. ఈ విష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల్లో వారే చెప్పారు కూడా. అలాంటి చిరంజీవిని వార‌సుడి విష‌యంలో విమ‌ర్శించ‌డం అస్స‌లు క‌రెక్ట్ కాద‌ని మెగా ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.

హాస్టల్ వార్డెన్ లా ఫీల‌వుతున్నాన‌న్న చిరూ

కాగా గ‌తంలో చిరంజీవి, ఓ సంద‌ర్భంలో మ‌న‌వడు ఉంటే బావుంటుంద‌ని కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇంట్లో ఎటు చూసినా ఆడ‌వాళ్లే ఉన్నార‌ని, అలా ప్ర‌తీ క్ష‌ణం చుట్టూ ఆడవాళ్ల‌ను చూడ‌టం వ‌ల్ల త‌న‌కు లేడీస్ హాస్ట‌ల్ వార్డెన్ లాగా ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంద‌ని కామెంట్ చేయ‌గా, ఆ కామెంట్స్ అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే.




Tags:    

Similar News