జమ్ము బ్యూటీ అరవ స్టార్లతో బిజీ!
శ్రద్దా శ్రీనాధ్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `జెర్సీ`తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు తొలి సినిమాతోనే మంచి పెర్పార్మర్ గా ప్రూవ్ చేసుకుంది.;
శ్రద్దా శ్రీనాధ్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `జెర్సీ`తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు తొలి సినిమాతోనే మంచి పెర్పార్మర్ గా ప్రూవ్ చేసుకుంది. `జోడీ`,` కృష్ణా అండ్ హిజ్ లీలా`, `మెకానిక్ రాకీ`, `డాకు మహారాజ్` లాటి చిత్రాల్లో నటించింది. కానీ నటిగా మాత్రం టాలీవుడ్ లో స్థిరపడలేకపోయింది. అందం, అభినయం అన్ని ఉన్నా? బిజీ స్టార్ గా మారలేకపోయింది. అందుకు ట్యాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. గ్లామర్ పాత్రలకు సై అంటే నిలబడగలం అన్న విషయాన్ని అమ్మడు ఆరంభంలోనే గుర్తించింది. ఆ రకంగా వచ్చిన చాలా అవకాశాలను వదలుకుంది.
నాలుగేళ్ల తర్వాత బిజీ:
నటిగా కొన్ని పరిమితులు విధించుకునే పని చేసింది. దీంతో ఆమె కంటే వెనుకొచ్చిన చాలా మంది తారలు అగ్ర హీరోయిన్లగా ఎదిగారు. ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకు వచ్చే గుర్తింపు పెర్పార్మెన్స్ ఓ రియేంటెడ్ పాత్రలకు రాదు? అన్నది ఈ బ్యూటీ విషయంలో మరోసారి ప్రూవ్ అయింది.` జెర్సీ` తర్వాత రెండుమూడు సినిమాలు వెంట వెంటనే చేసినా ఆ తర్వాత కొత్త ఛాన్సులందుకోవడానికి ఏకంగా నాలుగేళ్లు సమయం పట్టింది. ఇదంతా అమ్మడి గ్రాఫ్ పరిశీలిస్తే అర్దమైన విషయం. చివరిగా సొగసరి తెలుగులో కమిట్ అయిన చిత్రం `కలియుగం 2064` .
రెండు సినిమాలతో బిజీ:
కానీ ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఏడాది కాలంగా సెట్స్ లోనే ఉంది. అప్పటి నుంచి ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు. మరి శ్రద్దా శ్రీనాద్ తాజా అప్ డేట్ ఏంటి? అంటే అరవ స్టార్లతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది విష్ణు విశాల్ కి జోడీగా `ఆర్యన్` అనే చిత్రంలో నటించింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో అమ్మడు పేరుకే హీరోయిన్ తప్ప! అందులో శ్రద్దాకి పెద్దగా గుర్తింపు అంటూ లేదు. ప్రస్తుతం `బ్రో కోడ్` అనే చిత్రంలో నటిస్తోంది. ఇదీ డీలే అవుతోన్న ప్రాజెక్ట్ . రెండు నెలల క్రితమే ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు.
అక్కడ ఎంట్రీకి భిన్నంగా:
నటిగా కన్నడ, మలయాళ భాషల్ని కూడా టచ్ చేసింది. బాలీవుడ్ లో మాత్రం ఇంకా అడుగులు పెట్టలేదు. మరి కొత్త ఏడాదిలో అక్కడా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెడుతుందేమో చూడాలి. అమ్మడు నేటివ్ జమ్మ అండ్ కశ్మీర్. ఈ ప్రాంతం నుంచి వచ్చే బ్యూటీలు ముందుగా బాలీవుడ్ లోనే అడుగు పెడతారు. అటుపై సౌత్ సినిమాలపై దృష్టి పెడతారు. శ్రద్దా శ్రీనాధ్ మాత్రం అందుకు భిన్నంగా మాలీవుడ్ లో లాంచ్ అయి అటుపై ఇతర భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ బ్యూటీ మళ్లీ టాలీవుడ్ ప్రయత్నాలు చేస్తుందా? అన్నది చూడాలి.