సన్నీలియోన్.. చాక్లెట్ లాంటి గ్లామర్ ట్రీట్

సన్నీలియోన్ అంటేనే గ్లామర్ కి మరో బ్రాండ్ ఇమేజ్. వయసు పెరుగుతున్నా ఆమెలోని అందం, ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు.;

Update: 2026-02-02 09:29 GMT

సన్నీలియోన్ అంటేనే గ్లామర్ కి మరో బ్రాండ్ ఇమేజ్. వయసు పెరుగుతున్నా ఆమెలోని అందం, ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ బ్యూటీ చాక్లెట్ బ్రౌన్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతూ దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. డీప్ వీ నెక్ డిజైన్ తో ఉన్న ఈ స్లీవ్ లెస్ గౌన్ లో సన్నీ తనదైన శైలిలో అందాల విందు చేసింది. ఆ డ్రెస్ లో ఆమె నిల్చున్న తీరు, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఒక పాలరాతి శిల్పంలా అనిపిస్తోంది.




 


ఈ లుక్ లో సన్నీ హెయిర్ స్టైల్ చాలా స్పెషల్ గా ఉంది. తడి ఆరిన జుట్టులా ముందు వైపు వదిలేసి, వెనుక ముడి వేసుకున్న తీరు ఆమె ముఖానికి మరింత అందాన్ని తెచ్చింది. మెడలో సన్నని గొలుసు, చెవులకు చిన్న కమ్మలు ధరించి చాలా క్లాసీగా రెడీ అయ్యింది. పియానో ముందు నిల్చుని, సీరియస్ గా చూస్తూ ఆమె ఇచ్చిన ఫోజులు చూస్తుంటే కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే.




 


ఇక సన్నీలియోన్ కెరీర్ విషయానికి వస్తే, ఒకప్పుడు అడల్ట్ స్టార్ గా ప్రపంచానికి పరిచయమైన ఆమె, తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'జిస్మ్ 2' తో మొదలైన ఆమె ప్రయాణం, 'రాగిణి ఎంఎంఎస్ 2', 'ఏక్ పహేలీ లీలా' వంటి చిత్రాలతో విజయవంతంగా సాగింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా, 'లైలా మై లైలా', 'బేబీ డాల్' వంటి ఐటమ్ సాంగ్స్ తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.




 


టాలీవుడ్ ప్రేక్షకులతో కూడా సన్నీకి మంచి అనుబంధం ఉంది. మంచు మనోజ్ సినిమా 'కరెంట్ తీగ' లో సన్నీ టీచర్ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజశేఖర్ 'గరుడ వేగ' లో స్పెషల్ సాంగ్ చేసి మాస్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. ఆమధ్య కాలంలో మంచు విష్ణు సరసన 'జిన్నా' సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి మెప్పించింది. భాష ఏదైనా సరే తన గ్లామర్, డ్యాన్స్ తో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో సన్నీ ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం ఆమె పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో పాటు, సౌత్ లోనూ మరిన్ని మంచి అవకాశాల కోసం చూస్తోంది.

Tags:    

Similar News