అనుపమ క్యూట్ స్మైల్.. ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న లుక్!
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న ట్రెడిషనల్ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న ట్రెడిషనల్ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. పచ్చని ప్రకృతి నడుమ, తనదైన చిరునవ్వుతో ఆమె దిగిన పిక్స్ నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వైబ్రెంట్ గ్రీన్ సిల్క్ శారీలో అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ, కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్న ఈ అందమైన ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
గ్రీన్ సిల్క్ శారీ అండ్ ఎమరాల్డ్ టోన్స్ :
తాజా ఫోటోషూట్ కోసం అనుపమ పరమేశ్వరన్ అద్భుతమైన ఎమరాల్డ్ గ్రీన్ చీరను ఎంచుకుంది. డ్యూయల్-టోన్ టెక్స్చర్‌తో పాటు చీర అంతటా సన్నని గోల్డెన్ హారిజాంటల్ స్ట్రిప్స్, అంచుల వెంబడి వెడల్పాటి గోల్డ్ బార్డర్ ఉన్న ఈ చీర ఆమెకు రాయల్ లుక్‌ను తెచ్చిపెట్టింది. ఇక దీనికి మ్యాచింగ్‌గా క్లోజ్-నెక్, ఎల్బో-లెంత్ బ్లౌజ్ ధరించి ఎంతో పద్ధతిగా, కనిపించింది.
ట్రెడిషనల్ జ్యువెలరీ అండ్ నేచురల్ మేకప్ :
ఈ సాంప్రదాయ లుక్‌ను మరింత హైలైట్ చేయడానికి అనుపమ సున్నితమైన గోల్డ్ చోకర్ నెక్లెస్, చేతి నిండా పచ్చని గాజులు, గోల్డెన్ బ్యాంగిల్స్ ధరించింది. నుదుట చిన్న బొట్టు, ముఖంపై పడే రింగుల జుట్టు (సాఫ్ట్ కర్ల్స్), ఎలాంటి హంగుబాట్లు లేని నాచురల్ మేకప్ ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. "మగలే" మూమెంట్‌ను తలపించేలా ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
సౌత్ ఇండస్ట్రీలో వరుస విజయాలు: ఇక 'అ ఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుపమ, 'ఉన్నది ఒకటే జిందగీ', 'కార్తికేయ 2', అలాగే బ్లాక్‌బస్టర్ 'టిల్లు స్క్వేర్' చిత్రాలతో తన సత్తా చాటింది. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా తమిళ, కన్నడ పరిశ్రమల్లోనూ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
చేతిలో క్రేజీ ప్రాజెక్టులు:
ప్రస్తుతం అనుపమ కెరీర్ ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఇటీవలే 'డ్రాగన్', 'పరధ', 'బైసన్ కాలమదన్', 'కిష్కింధపురి' , 'లాక్‌డౌన్', 'మరీచిక' వంటి చిత్రాలతో అలరించిన ఆమె, త్వరలో 'క్రేజీ కల్యాణం', 'భోగి' వంటి క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తన సహజమైన నటన, క్యూట్ స్మైల్‌తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంటున్న అనుపమ పరమేశ్వరన్, రాబోయే రోజుల్లో వెండితెరపై మరిన్ని ఘన విజయాలు సాధించాలని అభిమానులు మనసారా కోరుకుంటున్నారు.