పవన్ కళ్యాణ్ వద్దకి చుట్టమల్లె సాంగ్ వివాదం...!
ఇప్పటికే ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయమై ఎంక్వయిరీ నడుస్తోంది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమాలోని చుట్టమల్లె సాంగ్ ని సోషల్ మీడియాలో కొందరు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోని రూపొందించిన విషయం తెలిసిందే. ఆ వీడియో తీవ్ర దుమారాన్ని రేపింది. చాలా తక్కువ సమయంలోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అంతే స్పీడ్‌గా ఇండస్ట్రీకి చెందిన వారు స్పందించడంతో సోషల్ మీడియాలో ఆ వీడియోను కనిపించకుండా చేశారు. ఇండస్ట్రీ మొత్తం ఆ డీప్ ఫేక్ వీడియోకి వ్యతిరేకంగా తమ గళం వినిపించారు. ఎన్టీఆర్ డీప్ ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందిస్తూ దాని వెనుక ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఆ వీడియో చేసిన వారిని కచ్చితంగా పట్టుకుని, కఠిన శిక్ష పడే వరకు ఊరుకునేది లేదని సుదీర్ఘ పోస్ట్‌లో ఎన్టీఆర్ పోస్ట్ చేయడం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ వద్దకు...
ఇప్పటికే ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయమై ఎంక్వయిరీ నడుస్తోంది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. చిరంజీవితో పాటు టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు సైతం ఈ విషయమై సీరియస్ గా స్పందించారు. సెలబ్రెటీలను ఇలా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వారి యొక్క గౌరవానికి భంగం కలిగించే ఏ ఒక్కరిని క్షమించి వదిలేసేది లేదని ఇండస్ట్రీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ డీప్ ఫేక్ వీడియోలపై కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు, అంతే కాకుండా ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వద్దకు తీసుకెళ్లబోతున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయమై సీరియస్ గా స్పందించి చర్యలు తీసుకునే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
టాలీవుడ్ సెలబ్రిటీల....
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ విషయమై సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలోనూ ఆయనకు సంబంధించిన కొన్ని డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. అందుకే పవన్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల భద్రత విషయమై కచ్చితంగా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ముందు ముందు ఇలాంటివి జరగకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీవర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలను షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది. అయితే మరింత కఠినంగా సోషల్ మీడియాలో ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు షేర్ చేసే వాళ్లపై వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్...
టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌కి మద్దతుగా నిలిచిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పని చేసి, ఆ వీడియో లింక్ లు లేకుండా చూశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు అందరు హీరోల ఫ్యాన్స్ ఆ వీడియోను రిపోర్ట్ చేయడం ద్వారా చాలా ఈజీగానే సోషల్ మీడియాలో లేకుండా చేయగలిగారు. అతి త్వరలోనే ఆ వీడియోను క్రియేట్ చేసిన వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుంటారనే నమ్మకంను ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ విషయమై సీరియస్‌గా వ్యవహరించాలని ఇండస్ట్రీ వర్గాల వారు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ కేసు విచారణ విషయమై సహకారం అందే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.