ఫ్రెండ్స్‌తో సరదా సాయంత్రం.. నమ్రతా లేటెస్ట్ పిక్స్ వైరల్!
"మళ్లీ కలిసాము.. గర్ల్ గ్యాగ్‌తో సరదా సాయంత్రాలు" అంటూ నమ్రత పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతూ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు సతీమణి, నటి, నిర్మాత నమ్రతా శిరోద్కర్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్నేహితురాళ్లతో కలిసి గడిపిన సరదా సాయంత్రపు జ్ఞాపకాలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. "మళ్లీ కలిసాము.. గర్ల్ గ్యాగ్‌తో సరదా సాయంత్రాలు" అంటూ నమ్రత పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతూ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
స్నేహితురాళ్లతో ఆత్మీయ కలయిక:
నమ్రత షేర్ చేసిన ఈ ఫొటోలో ఆమెతో పాటు కూతురు సితార ఘట్టమనేని, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్, వంశీ పైడిపల్లి సతీమణి మాలిని పైడిపల్లి తదితరులు కనిపించారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఇంట్లోనే రిలాక్స్డ్‌గా గడిపిన ఈ చిన్న గెట్‌టెండర్ పిక్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
తగ్గేదేలే అంటున్న స్టార్ కిడ్ సితార :
ఈ గెట్‌టెండర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని. కేవలం 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలో సితార సంచలనాలు సృష్టిస్తోంది. ప్రసిద్ధ జ్యువెలరీ బ్రాండ్ తరఫున న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై కనిపించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, ఆ క్యాంపెయిన్ ద్వారా వచ్చిన కోటి రూపాయల జీతాన్ని పిల్లల చదువులు, ఆరోగ్య సేవలకు విరాళంగా ఇచ్చి అందరి ప్రశంసలు అందుకుంది.
యూట్యూబ్‌లోనూ సితార సందడి :
మోడలింగ్‌తో పాటు డిజిటల్ ప్రపంచంలోనూ సితార తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ‘ఆద్య, సితార’ యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ యువతను అలరిస్తున్న సంగతి తెలిసిందే..ఇక చదువుతూనే ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ రాణిస్తున్న సితారను చూసి అందరూ అభినందిస్తున్నారు.
మహేష్ బాబు 'వారణాసి' మూవీపై భారీ బజ్ :
మరోవైపు మహేష్ బాబు కెరీర్ పరంగానూ ప్రస్తుతం ఫుల్ జోరు మీద ఉన్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ మూవీ 'వారణాసి' సినిమాపై టాలీవుడ్‌లో భారీ బెంచ్ మార్క్ అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ స్టార్‌గా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
2027 ఏప్రిల్‌లో గ్రాండ్ రిలీజ్ :
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా వచ్చే ఏడాది అంటే 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మూవీ కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు..ఇలా ఒకవైపు కుటుంబంతో ఆనందంగా గడుపుతూ, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మహేష్-నమ్రత కుటుంబం ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.