హనుమంతుడి జీవితంపై AI వండర్
భవిష్యత్‌ని ఏఐ ఆక్రమిస్తోంది. ఇప్పటికే ఈ దురాక్రమణ ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఏదైనా ఒక కొత్త సాంకేతికత భవిష్యత్‌ని అనూహ్యంగా మార్చేయబోతుంటే, దాని పర్యవసానాలు కూడా ప్రమాదకరంగా ఉంటాయి.;
భవిష్యత్‌ని ఏఐ ఆక్రమిస్తోంది. ఇప్పటికే ఈ దురాక్రమణ ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఏదైనా ఒక కొత్త సాంకేతికత భవిష్యత్‌ని అనూహ్యంగా మార్చేయబోతుంటే, దాని పర్యవసానాలు కూడా ప్రమాదకరంగా ఉంటాయి. ఇప్పుడు ఏఐలో సినిమాలను రూపొందించడం అనే కళ, సాంకేతిక నిపుణుల మనుగడలో కొత్త ఉద్యోగాల సృష్టికి దారి తీయబోతోంది.
ఇటీవల తేజ సజ్జా ప్రధాన పాత్రలో రూపొందించిన `జై హనుమాన్` అసాధారణ విజయం సాధించింది. ఇప్పుడు ఏఐలో రూపొందించిన హనుమంతుడి కథ ప్రజల్ని రక్తి కట్టించబోతోంది. తాజాగా `చిరంజీవి హనుమాన్ - ది ఎటర్నల్` ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇది అభిమానులకు హనుమంతుడి జీవితం ఆధారంగా రానున్న పౌరాణిక చిత్రం గురించిన అవగాహన వీడియో. సోషల్ మీడియాలో విడుదలైన ఫస్ట్ లుక్ వీడియోకి అద్భుత స్పందన వస్తోంది. భారతీయ పురాణేతిహాసం-రామాయణంలో కీలక పాత్రధారి అయిన హనుమంతుడి జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది.
`చిరంజీవి హనుమాన్ - ది ఎటర్నల్`ను జాతీయ అవార్డు గ్రహీత -దర్శకనిర్మాత రాజేష్ మపుస్కర్ దర్శకత్వం వహించారు. ఇది థ్రిల్లింగ్ .. భయానకమైన అనుభవమని దర్శకుడు అంటున్నారు. ఇన్నోవేషన్ ని స్వీకరించి ఈ ప్రాజెక్టును చేపట్టాను. ఇది ఉత్కంఠభరితమైనది.. భయానకమైనది. సినిమాలోని వివిధ శైలులను అన్వేషించడం .. జనరేటివ్ AI వంటి ప్రగతిశీల సాంకేతికతను ఉపయోగించి కథ చెప్పడం నాకు చాలా ఇష్టం. హనుమంతుడి కథ కాలాతీతమైనది. హనుమాన్ బలం, భక్తి ని తెరపై చూపిస్తున్నాను. దీనిని అరుదైన అవకాశంగా భావిస్తున్నాను. పూర్తిగా కొత్త కోణంలో కథను తెరపై చూపించడానికి విక్రమ్ - విజయ్‌లతో చేతులు కలిపాను`` అని తెలిపారు.
మేకర్స్ ప్రకారం.. చిరంజీవి హనుమాన్ - ది ఎటర్నల్ భారతదేశంలో మొట్టమొదటి AI-ఆధారిత థియేట్రికల్ చిత్రంగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్ , సాంకేతిక విభాగం గల్లెరి5 నుండి 50 మందికి పైగా ఇంజనీర్ల బృందం దీనికి పని చేస్తోంది. కథనంలో ప్రామాణికతను డిఫైన్ చేయడానికి సాంస్కృతిక పండితులు, సాహిత్య నిపుణులు, రచయితలు పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విక్రమ్ మల్హోత్రాకు చెందిన అబుండంటియా ఎంటర్‌టైన్‌మెంట్ - కలెక్టివ్ మీడియా నెట్‌వర్క్‌కు చెందిన హిస్టరీవర్స్ నిర్మించాయి. 2026లో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.