వైల్డ్ గా ఉండటమే ఇష్టమంటున్న హీరో.. ఏం ప్లాన్ చేస్తున్నాడో?
కోలీవుడ్ యాక్టర్ కార్తీ రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో కార్తీ దుబాయ్ లో గుర్రపు స్వారీ చేస్తూ దర్శనమిచ్చారు.;
కోలీవుడ్ యాక్టర్ కార్తీ రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో కార్తీ దుబాయ్ లో గుర్రపు స్వారీ చేస్తూ దర్శనమిచ్చారు. అంతేకాదు, ఈ వీడియోలో కార్తీ ప్రొఫెషనల్ హార్స్ రైడర్ లాగా చాలా స్టైలిష్ గా, పవర్‌ఫుల్ లుక్ లో కనిపించారు. ఆ వీడియోకు మరింత ఎనర్జీని జోడించడానికి కార్తీ దురంధర్ సాంగ్ ను యాడ్ చేశారు.
ఎడారిలో ఉండటం ఇష్టమంటున్న కార్తీ
ఎడారి నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తనకు ఎడారిలో ఉండటం చాలా ఇష్టమని గ్రహించినట్టు రాసుకొచ్చారు. ఈ వీడియోను చూసినప్పటి నుంచి కార్తీ తన తర్వాతి ప్రాజెక్టుల కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నారేమో అని భావిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కార్తీ ఈ హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంది రిలాక్సేషన్ కోసమా లేక సినిమా కోసమా అని తెలియాల్సి ఉంది.
హిట్4 కోసమే ఆ ట్రైనింగా?
కార్తీ త్వరలోనే హిట్4 సినిమా షూటింగ్ లో జాయిన్ అవనున్నారని, ఆ సినిమా కోసమే కార్తీ ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నారని అంటున్నారు. శైలేష్ కొలను క్రియేట్ చేసిన హిట్ ఫ్రాంచైజ్ తెలుగు ఆడియన్స్ లో మంచి పేరును తెచ్చుకుంది. ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటికే మూడు సినిమాలు రిలీజవగా, క్రైమ్ ఇంటెన్స్ డ్రామాగా దీనికి మంచి డిమాండే ఉంది.
కాష్మోరా2 కోసమా?
హిట్3 క్లైమాక్స్ లో కార్తీ గెస్ట్ రోల్ లో కనిపించగా, హిట్4లో కార్తీ లీడ్ రోల్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక మరికొందరేమో కార్తీ గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది కాష్మోరా2 కోసమని అంటున్నారు. 2016లో వచ్చిన సూపర్ హిట్ సినిమా కాష్మోరాకు సీక్వెల్ గా రానున్న కాష్మోరా2 కోసం కార్తీ ఈ హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నారని సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి.
ఇదిలా ఉంటే కార్తీకి కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నాయి. రీసెంట్ గా వా వాతియార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో నిరాశను ఎదుర్కొన్న కార్తీ, తన తర్వాతి సినిమాతో ఎలాగైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగానే మంచి కథలపై కార్తీ ఫోకస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్తీ హార్స్ రైడింగ్ నేర్చుకోవడం వెనుక ఉన్న ప్లాన్ ఏంటనేది తెలియాల్సి ఉంది.