ప‌వ‌న్ కోసం చ‌ర‌ణ్‌..చ‌ర‌ణ్ కోసం అఖిల్‌!

టాలీవుడ్‌కు బాగా క‌లిసొచ్చే సీజ‌న్‌లు సంక్రాంతి, స‌మ్మ‌ర్‌, ద‌స‌రా, దీపావ‌ళి. ఈ ఏడాది సంక్రాంతి సీజ‌న్ అయిపోయింది. ఈ సీజ‌న్‌లో బ‌రిలోకి దిగిన మెగాస్టార్ `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుని సంక్రాంతి విజేత‌గా నిలిచింది.;

Update: 2026-02-06 11:30 GMT

టాలీవుడ్‌కు బాగా క‌లిసొచ్చే సీజ‌న్‌లు సంక్రాంతి, స‌మ్మ‌ర్‌, ద‌స‌రా, దీపావ‌ళి. ఈ ఏడాది సంక్రాంతి సీజ‌న్ అయిపోయింది. ఈ సీజ‌న్‌లో బ‌రిలోకి దిగిన మెగాస్టార్ `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుని సంక్రాంతి విజేత‌గా నిలిచింది. ఇక ఇదే సీజ‌న్‌లో యంగ్ హీరోలో శ‌ర్వానంద్ `నారీ నారీ న‌డుమ మురారి`తో, న‌వీన్ పొలిశెట్టి `అన‌గ‌న‌గ ఒక రాజు` సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజ‌యాన్ని అందుకున్నాయి.

ర‌వితేజ `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` అంటూ హ‌డావిడి చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. ఈ సినిమాల‌తో సంక్రాంతి ఫైట్‌ ముగిసిపోవ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి స‌మ్మ‌ర్ స‌మ‌రంపై ప‌డింది. సంక్రాంతి స‌మ‌రం త‌ర‌హాలోనే వేస‌వి యుద్ధం కూడా టాలీవుడ్‌కు సంబ‌రాల్ని తెచ్చి పెడుతుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వేస‌వి బ‌రిలోకి ఏ స్టార్ దిగ‌బోతున్నాడు? ఇంత‌కీ ఏ ఏ సినిమాలు పోటీప‌డ‌బోతున్నాయ‌న్న‌ది నిన్న మొన్న‌టి వ‌ర‌కు స‌స్పెన్స్‌గానే ఉంది. ఈ స‌స్పెన్స్‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్, రామ్‌చ‌ర‌ణ్ తాజాగా తెరదించారు.

ప‌వ‌న్ కోసం చ‌ర‌ణ్ వెన‌క్కి త‌గ్గి దారిచ్చేశాడు. ఇంత వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న`పెద్ది` మూవీని మార్చి 27న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్‌ని కూడా అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` కోసం చ‌ర‌ణ్ త‌న `పెద్ది` మూవీని వెన‌క్కి నెట్టి మార్చి 27న కాకుండా ఏప్రిల్ 30కి వెళ్లిపోవ‌డం తెలిసిందే. అబ్బాయ్ త‌ప్పుకోవ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`ని మార్చి 26న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.

ముందుగా త‌మ‌మూవీని మార్చి 26న రిలీజ్ చేస్తున్నామంటూ `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` టీమ్ ప్ర‌క‌టించ‌డంతో ఆ వెంట‌నే రామ్ చ‌ర‌ణ్ `పెద్ది` టీమ్ కూడా త‌మ రిలీజ్ డేట్‌ని మార్చేసుకున్నామ‌ని, మార్చి 27న కాకుండా ఏప్రిల్ 30న వ‌చ్చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డంతో బాబాయ్ కోసం అబ్బాయ్ త‌గ్గాడ‌ని అంద‌రికి తెలియ‌డ‌మే కాకుండా స‌మ్మ‌ర్ స‌మరంపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. అయితే చ‌ర‌ణ్ `పెద్ది` ఏప్రిల్ 30న వ‌స్తుండ‌టం ఇప్పుడు అఖిల్‌కు ఇబ్బందిక‌రంగా మారింది.

వ‌రుస డిజాస్ట‌ర్ల త‌రువాత ఈ సారి ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని ద‌క్కించుకోవాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న అఖిల్ మే 1న `లెనిన్‌` మూవీతో రానున్న విష‌యం తెలిసిందే. అయితే `పెద్ది` రిలీజ్ ఏప్రిల్ 30కి మార‌డంతో అఖిల్ సినిమా రిలీజ్ ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డింది. `పెద్ద‌` రిలీజ్ త‌రువాత ఒకే ఒక్క రోజు మాత్ర‌మే గ్యాప్ ఉండ‌టంతో `లెనిన్‌` క‌లెక్ష‌న్స్‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని భావించిన టీమ్ త‌మ సినిమాని వాయిదా వేసుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. మే యూడ‌వ వారానికి వాయిదా వేయాల‌ని భావిస్తున్నార‌ట‌. చ‌ర‌ణ్‌తో అఖిల్‌కున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని మేక‌ర్స్ సినిమా రిలీజ్‌ని పోస్ట్ పోన్ చేస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌.

Tags:    

Similar News