తరుణ్ భాస్కర్ నెక్స్ట్.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లా ఉందే..

ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది మూవీ సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్న తరుణ్ భాస్కర్.. రీసెంట్ గా ఓం శాంతి శాంతి శాంతి: మూవీతో థియేటర్స్ లోకి వచ్చి మెప్పించారు.;

Update: 2026-02-06 12:00 GMT

టాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అటు సినిమాలను తెరకెక్కిస్తూ.. ఇటు లీడ్ రోల్స్ లో మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది మూవీ సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్న తరుణ్ భాస్కర్.. రీసెంట్ గా ఓం శాంతి శాంతి శాంతి: మూవీతో థియేటర్స్ లోకి వచ్చి మెప్పించారు.



 


ఇప్పుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న మరో ప్రాజెక్టు అనౌన్స్మెంట్ వచ్చింది. గాయపడ్డ సింహం టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సాధినేని సమర్పణలో సప్తస్వ మీడియా వర్క్స్, పీవోవీ స్టోరీస్, జీ స్టూడియోస్ సంస్థలు సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

అయితే టైటిల్ పోస్టర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో పాస్‌ పోర్ట్ స్టాంప్ స్టైల్ డిజైన్, అమెరికన్ ఫ్లాగ్ మోటిఫ్, దూసుకెళ్తున్న విమానం, డొనాల్డ్ ట్రంప్ కార్టూన్ ఇమేజ్, పాత కంపాస్ బాక్స్ వంటి ఎలిమెంట్స్.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో సినిమా ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్, సెటైరికల్ కామెడీ, క్రైమ్ ఎలిమెంట్స్ తో రూపొందుతుందని అర్థమవుతోంది.

అదే సమయంలో పోస్టర్‌ పై మేకర్స్.. నవ్వొద్దు.. ఇది సీరియస్ మ్యాటర్ అంటూ ఇచ్చిన ట్యాగ్‌ లైన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. సీరియస్ సబ్జెక్ట్‌ కు కామెడీ యాడ్ చేసి మూవీ తెరకెక్కిస్తున్నట్లు ట్యాగ్ లైన్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. మొత్తానికి టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్ స్టోరీతో మూవీ తీస్తున్నట్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తరుణ్ భాస్కర్ ఇప్పటికే దర్శకుడిగా పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో యూత్ ను ఆకట్టుకున్నారు. యాక్టింగ్ పరంగా.. తనదైన శైలిలో పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు గాయపడిన సింహం ద్వారా మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టైటిల్ పోస్టర్ ద్వారా గాయపడిన సింహం టీజర్ ను ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యూజిక్ ను స్వీకర్ అగస్తి అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిందని, ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు మేకర్స్ తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. అవి కూడా చివరి దశలో ఉన్నాయట. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ కానుందని సమాచారం. మరి గాయపడిన సింహం మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి. భాస్కర్ నెక్స్ట్.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లా ఉందే..

Tags:    

Similar News