సౌత్ బ్యూటీకి బీ టౌన్ లో కష్టాలు.. 'ఆమె' వల్లేనట!
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్.. ఎప్పటికప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న విషయం తెలిసిందే.;
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్.. ఎప్పటికప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పలువురు హీరోయిన్స్.. నార్త్ లో యాక్ట్ చేస్తున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇంకొందరు క్రేజ్ సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు.
వారిలో ఓ బ్యూటీ ఇప్పుడు తన టాలెంట్ తో పాటు హార్డ్ వర్క్ తో అందరినీ ఆకట్టుకుంటోందట.
అందరి దృష్టిలో మంచి అమ్మాయి అనే పేరు కూడా సంపాదించుకుందని టాక్. సెట్స్ కు టైమ్ కు వస్తూ.. షెడ్యూల్ ను అనుకున్నట్లు పూర్తి చేస్తూ.. అందరితో కలివిడిగా మాట్లాడుతూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఇప్పటికే సొంతం చేసుకుందని వినికిడి.
ముఖ్యంగా తన ప్రొఫెషనలిజంతో అందరినీ అట్రాక్ట్ చేసేసిందట. ఇవన్నీ బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆ బ్యూటీకి బాలీవుడ్ లో అనుకోని అడ్డంకులు ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె కమిట్ అయిన సినిమాలు.. లాస్ట్ మినిట్ లో ఆగిపోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని అంతా సెట్ అయ్యే టైమ్ కు చేతులు మారుతున్నట్లు టాక్.
ఇంకొన్ని సినిమాలు షూటింగ్ మొదలయ్యాక కూడా ఆగిపోతున్నట్లు సమాచారం. అయితే వాటన్నింటికి ఒకటే కారణం.. ఆ బ్యూటీతో ఎప్పుడూ ఉండే ఒక పర్సన్ అంట. ఆమె వల్ల బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ లో సమస్యలు ఎదురువుతున్నట్లు తెలుస్తోంది. ఆమె పెట్టిన కండీషన్స్ వల్ల చాలా సినిమాలు ఆగుతున్నట్లు వినికిడి.
ఎందుకంటే సదరు బ్యూటీ కెరీర్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు అన్నింటిలో ఆమె జోక్యం చేసుకుంటోందట. అంతే కాదు సెట్స్ విషయంలో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతోందని తెలుస్తోంది. కనీసం చర్చించాలకున్నా కూడా పర్మిషన్ తప్పదట. అలా బ్యూటీ విషయంలో ఎక్కువ నియంత్రణ ఉంటుందని వినికిడి.
దీంతో ఎక్కువ మంది నిర్మాతలు.. బ్యూటీకి మంచి టాలెంట్ ఉన్నా.. ఆమె వల్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. మొదట ఒప్పందం కుదిరిన తర్వాత కూడా కొత్త షరతులు ముందుకు రావడం వల్ల ఆ హీరోయిన్ తో పని చేయడం కష్టంగా మారుతోందనిభావిస్తున్నారట.
సదరు బ్యూటీ నవ్వుతూ అందరితో బాగానే ఉంటున్నా.. ఆమెతో ఉండే పర్సన్ వల్ల అన్ని సమస్యలు వస్తున్నాయట. మరి ఆ హీరోయిన్ ఎవరో.. ఆమెతోపాటు ఉండే ఆ పర్సన్ ఎవరో తెలియాల్సి ఉంది.