వడి వడిగా మళ్లీ అడుగులా?
సూపర్ స్టార్ రజనీకాంత్ వారుసురాలిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఐశ్యర్యా రజనీకాంత్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు.;
సూపర్ స్టార్ రజనీకాంత్ వారుసురాలిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఐశ్యర్యా రజనీకాంత్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్లే బ్యాక్ సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య క్రియేటివ్ రంగం వైపు అడుగులు వేసారు. `3` సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. అటుపై `వెయ్ రాజా వెయ్`, ` సినిమా వీరన్`, `లాల్ సలామ్` లాంటి చిత్రాలు తెరకెక్కించారు. కానీ దర్శకురాలిగా అనుకున్నంతగా ఫేమస్ కాలేకపోయారు.
థ్రిల్లర్ సబ్జెక్టా?
చివరిగా డైరెక్ట్ చేసిన `లాల్ సలామ్` రిలీజ్ అయి రెండేళ్లు సమీపిస్తుంది. అప్పటి నుంచి మళ్లీ కొత్త చిత్రం పట్టాలెక్కించలేదు. ఈ క్రమంలో భర్త ధనుష్ తో విబేధాలు కారణంగానూ ప్రోఫెషన్ పై దృష్టి పెట్టలేకపోయారు. తాజాగా ధనుష్ తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐశ్వర్యా రజనీకాంత్ మళ్లీ కెరీర్ పై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్ట్ గురించి కోలీవుడ్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవలే ఐశ్వర్య , నటుడు విశాల్ కి ఓ స్టోరీ వినిపించారుట. ఇదొక థ్రిల్లర్ కాన్పెప్ట్ అని సమాచారం.
విశాల్ ఒకే చేసాడా?
స్టోరీ నచ్చడంతో విశాల్ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఐశ్వర్య ఈ స్క్రిప్ట్ పైనే సీరియస్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో విశాల్ కూడా కొత్త ప్రాజెక్ట్ లు ఏవీ కమిట్ అవ్వలేదు. ఆయనే స్వీయా దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తున్నాడు. `ముగుదం`, `డిటెక్టివ్ 2` చిత్రాలు రెండు తన దర్శక త్వంలోనే రూపొందుతున్నాయి. బయట కథలు డినడం గానీ, స్టార్ డైరెక్టర్లతో పని చేస్తున్నాడని గానీ ఎలాంటి వార్తలు రాలేదు. చాలా కాలానికి ఐశ్వర్య స్టోరీపై విశాల్ పాజిటివ్ గా స్పందిచడంతో ఈ కాంబో పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
ఆ రెండు సినిమాలతో బిజీగా:
కథలు నచ్చితే విశాల్ బయట బ్యానర్లకు ఛాన్స్ఇవ్వకుండా తానే నిర్మిస్తుంటాడు. అలాగే ఐశ్వర్య కూడా సొంత బ్యానర్లోనే నిర్మించడానికి ఆసక్తిగా ఉంటారు. మరి ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు? అన్నది చూడాలి. ప్రస్తుతం విశాల్ `డిటెక్టివ్ 2` చిత్రం రిలీజ్ పనుల్లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తై నెలలు గుడుస్తున్నా? ఇంత వరకూ రిలీజ్ కాలేదు. గత ఏడాదే రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యంగా కారణంగా వాయిదా పడుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.