ఆయనలా ఈయన చేయలేకపోతున్నాడు!
ఇండస్ట్రీలో ట్యాలెంట్ ఒక్కటే సరిపోదు. అంతకుమించి పరిచయాలుండాలి. పొర్లు దండాలు పెట్టాలి. వీలైనప్పుడల్లా భజన చేయాలి.;
ఇండస్ట్రీలో ట్యాలెంట్ ఒక్కటే సరిపోదు. అంతకుమించి పరిచయాలుండాలి. పొర్లు దండాలు పెట్టాలి. వీలైనప్పుడల్లా భజన చేయాలి. పైవాడు ఏం చేబితే దానికి గంగిరెద్దిలా తల ఊపాలి. అప్పుడే అవకాశాలు వచ్చేవి.ప్రతిభతో పాటు ఈ లక్షణా లన్నీ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎదిగే వరకూ ఈ రకమైన పరిస్థితులు ఎంతటివారైనా ఎదుర్కోవాల్సిందే. ఎదిగిన తర్వాత కూడా నీ ఎదుగుదల ను తొక్కే రాజకీయాలు జరుగుతుంటాయి. వాటిని కూడా తట్టుకోవాలి. అప్పుడు నీ కంటూ బలం ఉంటుంది కాబట్టి! వాటిని ఎదుర్కోవడం కాస్త సులభమవుతుంది.
అయినా సరే ఇండస్ట్రీలో రాణించాలంటే సలామ్ లు కొడుతూనే ఉండాలి. ప్రముఖంగా ఈ ఒరవడి ఎక్కువగా తెలుగు పరిశ్రమలో కనిపిస్తుంది. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఓ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య పోటీ నెలకొనడంతో ఈ టాపిక్ అంతా చర్చకొస్తుంది. తెలుగు పరిశ్రమలో ఓ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య కొంత కాలంగా పోటీ కనిపిస్తొంది. ఇద్దరు తెలుగు వారే. ప్రతిభావంతులే. ఎంతో మంది స్టార్ హీరోలకు పని చేసిన సంగీత దర్శకులే. కాకపోతే ఇక్కడ రాణించాలంటే? కొన్ని కొన్ని టెక్నిక్ లు కూడా తెలిసి ఉండాలని ఓ మ్యూజిక్ డైరెక్టర్ తీరును చూస్తే అర్దమవుతోంది.
అతడు ఇండస్ట్రీలో ఏ పెద్ద హీరో కనిపించినా వినయంగా మసులుకుంటాడు. సందర్బాను సారం వ్యవహ రిస్తుంటాడు. చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా సరే! తన హోదాని మర్చిపోయి నమస్కరించడం ఓ సంస్కారంగా భావిస్తుంటాడు. ఇది అతడికి పరిశ్రమలో బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇలాంటి తీరుతో ఉన్న కారణంగా చాలా మంది హీరోలు సంగీత దర్శకుడిగా పిలిచి మరీ అవకాశాలిస్తున్నారు. ప్రముఖంగా ఓ పేరున్న హీరో అయితే ఈ మధ్య కాలంలో అతడినే పదే పదే రిపీట్ చేస్తున్నాడు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ తో ట్రై చేద్దాం? అన్న ఆలోచన కూడా రాకుండా పని చేస్తున్నారు. అంతగా హీరోకి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కనెక్ట్ అయ్యాడు.
అయితే అదే హీరో గతంలో తన కాంపిటేటర్ కి ఎక్కువగా అవకాశాలిచ్చేవారు. కానీ ఓ హాఠాత్పరిణామంతో సన్నివేశం రివర్స్ అయింది. అప్పటి నుంచి ఆ సంగీత దర్శకుడిని పక్కన బెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పుడా ఆ స్టార్ హీరో పాత స్వరం వైపు చూడటం లేదు. మరి ఆ పాత స్వరాన్ని కోరుకునేది ఎప్పుడు? అందుకు మళ్లీ అవకాశం ఉంటుందా? అంటే? ఎందుకుండదు. కలహాలు ఎక్కడైనా సహజం. గాయం ఎప్పటికైనా మానకా తప్పదు. మాట కటువుగా ఉన్నా? మనసు వెన్న! కలిసి ఉంటే కలదు సుఖం అన్న మాటను బలంగా నమ్మే వ్యక్తి. ఒక్క ఛాన్స్ తో కలతలన్నింటికీ పుల్ స్టాప్ పెట్టొచ్చు.