ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్‌?

నేనెప్పుడూ నేర‌పూరిత కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌లేదు. ఎప్‌స్టీన్‌తో నా ప‌రిచ‌యం చాలా ప‌రిమిత‌మైన‌ది. వివాదాస్ప‌ద లైంగిక నేరాల ఘ‌ట‌న‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు` అని తెలిపాడు.;

Update: 2026-02-05 19:50 GMT

ఎప్‌స్టీన్ సెక్స్ కుంభ‌కోణం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. దీని కార‌ణంగా సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఇప్ప‌టికే ఎంతో మంది ప్ర‌ముఖుల పేర్లు ఇందులో బ‌య‌ట‌ప‌డ‌టంతో ప్ర‌పంచం నివ్వ‌ర‌పోయింది. మైక్రోసాఫ్ట్ దిగ్గ‌జం బిల్ గేట్స్ పేరు కూడా ఇందులో రావ‌డం..దాని కార‌ణంగానే తాము విడాకులు తీసుకున్నాయ‌ని ఆయ‌న భార్య స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. తాజాగా ఈ ఫైల్స్ లిస్ట్‌లో బాలీవుడ్ సెల‌బ్రిటీల పేర్లు కూడా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తుండ‌టం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

గ‌తంలో ఎప్‌స్టీన్ ఏర్పాటు చేసిన పార్టీకి ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారంటూ కొంత మంది సినీ ప్ర‌ముఖుల పేర్లు తాజాగా బ‌య‌టికి వ‌చ్చాయి. అంతే కాకుండా కొంద‌రు న‌టీన‌టులు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు గ‌తంలో ఎప్‌స్టీన్‌కు పంపిన ఈమెయిల్స్ తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న‌ట్టుగా బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ సెల‌బ్రిటీ దీప‌క్ చోప్రా పేరు బ‌య‌ట‌ప‌డింది. అయితే దీనిపై ఆయ‌న స్పందించారు.

నేనెప్పుడూ నేర‌పూరిత కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌లేదు. ఎప్‌స్టీన్‌తో నా ప‌రిచ‌యం చాలా ప‌రిమిత‌మైన‌ది. వివాదాస్ప‌ద లైంగిక నేరాల ఘ‌ట‌న‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు` అని తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ వివాదాస్ప‌ద ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ పేరు ఉన్న‌ట్టుగా బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎప్‌స్టీన్ కు సంబంధించిన ఓ ఈవెంట్ కోసం అనురాగ్ 2017లో బీజింగ్ వెళ్లారంటూ రూమ‌ర్స్ వ‌చ్చాయి. వీటిపై ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, న‌టుడు అనురాగ్ క‌శ్య‌ప్ తాజాగా స్పందించారు.

వ‌క్తగా నాకు నెల‌కు దాదాపు 15 ఆహ్వానాలు వ‌స్తుంటాయి. అయితే అరుదుగా వాటిపై స్పందిస్తుంటా. నా జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు నేను బీజింగ్ వెళ్ల‌లేదు` అని పేర్కొన్నారు. త‌న సినిమాల క‌న్నా త‌న పేరుతో కూడిన ప్ర‌చారంపై ఆస‌క్తి చూప‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఈ నేప‌థ్యంలోనే బాలీవుడ్‌కు చెందిన ద‌ర్శ‌క నిర్మాత‌లు, న‌టీన‌టుల పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్నాయంటూ ప్ర‌చారం మొద‌లు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ఇదిలా ఉంటే అనురాగ్ క‌శ్య‌ప్ విభిన్న‌మైన సినిమాల‌తో బాలీవుడ్‌లో ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఓ ప‌క్క డైరెక్ట‌ర్‌గా సినిమాలు చేస్తూనే న‌టుడిగా కూడా కొన‌సాగుతున్నారు. హిందీతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాలు చేస్తున్న అనురాగ్ ఫ‌స్ట్ టైమ్ తెలుగులో అడివిశేష్‌తో క‌లిసి `డ‌కాయిట్ ఏ ల‌వ్‌స్టోరీ`లో న‌టిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ రిలీజ్‌ తాజాగా `ధురంధ‌ర్ 2` కార‌ణంగా మ‌రోసారి వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News