డార్లింగ్ వింటేజ్ సాంగ్.. అందులో నిజమెంత?

అదేం సాంగ్ అంటే.. నాచే నాచే. నిజానికి రిలీజ్ కు ముందు ఆ పాట మేకర్స్ విడుదల చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.;

Update: 2026-02-05 19:48 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ది రాజా సాబ్ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హారర్ ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా.. సంక్రాంతికి కానుకగా థియేటర్స్ లో విడుదలైంది. రిలీజ్ కు ముందు ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన రాజా సాబ్.. థియేటర్స్ లోకి వచ్చాక అనుకున్న రేంజ్ లో అందరినీ మెప్పించలేకపోయింది.

ఓపెనింగ్స్ భారీగానే వచ్చినా.. ఆ తర్వాత వసూళ్లు మాత్రం తగ్గిపోయాయి. దీంతో సినిమాకు పెద్ద ఎత్తున నష్టాలు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మూవీ రిలీజ్ అయినా నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలోని ఒక్క పాట కోసం ఏకంగా మేకర్స్ రూ.11 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

అదేం సాంగ్ అంటే.. నాచే నాచే. నిజానికి రిలీజ్ కు ముందు ఆ పాట మేకర్స్ విడుదల చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి ప్రభాస్ వేసిన స్టెప్పులు.. ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. డార్లింగ్ లుక్ కు అంతా ఫిదా అవ్వగా.. సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. థియేటర్స్ లో కూడా ఆ పాట.. ఆడియన్స్ ను మెప్పించిందనే చెప్పాలి.

అయితే ఆ సాంగ్ కోసమే రూ.11 కోట్లు ఖర్చు పెట్టారని వార్తలు వస్తున్నాయి. 1982లో బాలీవుడ్ స్టార్ నటుడు మిథున్ చక్రవర్తి డిస్కో డ్యాన్సర్ సినిమాలోని వింటేజ్ ఆవా ఆవా కోయి యహాన్ నాచే పాటకు రీమిక్స్ గా నాచే నాచే తీసుకొచ్చారు. దాదాపు 44 ఏళ్ల తర్వాత రాజా సాబ్ కోసం రీమిక్స్ చేయగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎనర్జిటిక్ ట్యూన్ కంపోజ్ చేశారు. నకాష్ అజీజ్, బృందా ఆలపించారు.

అలా పాత సాంగ్ హక్కులను సొంతం చేసుకుని షూట్ చేయడానికి మొత్తం రూ.11 కోట్లు అయిందని ప్రచారం జరుగుతోంది. అది చాలా ఎక్కువనే అభిప్రాయాన్ని అనేక మంది నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో క్యాస్టింగ్ లో కొందరి రెమ్యూనరేషన్ కూడా అంతలా ఉండదని.. అలాంటప్పుడు సాంగ్ కోసం భారీ ఖర్చు అవసరమా అని క్వశ్చన్ చేస్తున్నారు.

దాని వల్ల బడ్జెట్ బాగా పెరిగిందని అంటున్నారు. అదే సమయంలో అభిమానులు మాత్రం అంత ఖర్చు అయ్యి ఉండదని, కొందరు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ భారీ ఖర్చు అయినా ఆడియన్స్ ను అలరించేందుకే కదా.. అని అంటున్నారు. ఏదేమైనా నాచే నాచే సాంగ్ బడ్జెట్ కోసం జోరుగా చర్చ సాగుతోంది. అయితే నెట్టింట వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియదు. దానిపై మేకర్స్ కు మాత్రమే క్లారిటీ ఉంటుంది. మరి వారు ఏమైనా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News