వరలక్ష్మీ శరత్ కుమార్ ఫిట్నెస్ వెనుక ఇంత కష్టం ఉందా? వీడియో వైరల్!

తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ షేర్ చేసిన ఈ జిమ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.;

Update: 2026-02-05 19:46 GMT

మనిషి యవ్వనంగా కనిపించాలి అంటే ఫిట్నెస్ తప్పనిసరి.. ముఖ్యంగా ఆరోగ్యంగా కూడా ఉండడం అన్నది తప్పనిసరి అయిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎంత ఆరోగ్యంగా ఉంటామో అంత కాలం ఎక్కువ జీవిస్తాం అన్నది వాస్తవం. అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కాస్త గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడపడం వల్ల వారిపై మానసిక ఒత్తిడితో పాటు శారీరక ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. అందుకే సెలబ్రిటీలు తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తమ శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జిమ్ కి వెళ్తూ తెగ కష్టపడిపోతున్న విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా అత్యంత కష్టమైన కసరత్తులు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు.

అలాంటి వారిలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒకరు. తన నటనతో విశ్వరూపం చూపించడమే కాదు ఇలా తన శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి జిమ్ లో తెగ కష్టపడి పోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు కూడా.. ఈ క్రమంలోనే తాజాగా ఆమె జిమ్ కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అక్కడ ఆమె చేస్తున్న స్టంట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎంత కష్టపడి పోతుందో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ షేర్ చేసిన ఈ జిమ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. 2012లో విడుదలైన పోడాపోడి అనే తమిళ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. ఆ తర్వాత మాణిక్య అనే సినిమాతో అటు కన్నడ పరిశ్రమలో కూడా హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకుంది.కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ముఖ్యంగా తమిళ్, కన్నడ మలయాళం అంటూ పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. కానీ హీరోయిన్గా అదృష్టం తలుపు తట్టకపోవడంతో.. తన కెరీర్ ను యూటర్న్ తీసుకుంది.

అందులో భాగంగా హీరోయిన్ గా కాకుండా విలన్ పాత్రలు పోషిస్తూ సంచలనం సృష్టించింది. తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్ అనే సినిమాతో తన నటనలో యూటర్న్ తీసుకున్న ఈమె రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాతో విలన్ గా విధ్వంసం సృష్టించింది. ఆ తర్వాత నాంది, వీరసింహారెడ్డి, మైఖేల్ , ఏజెంట్, కోటబొమ్మాలి పిఎస్ ఇలా వరుస చిత్రాలలో నటిస్తూ విలన్ పాత్రలతో మెప్పిస్తుంది.

ఇక హీరోయిన్ గా, విలన్ గానే కాకుండా హనుమాన్ వంటి చిత్రాలలో సాత్విక పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం విజయ్ దళపతి హీరోగా నటించిన జన నాయగన్ సినిమాలో నటించింది కానీ ఈ సినిమా విడుదలకు ఇంకా నోచుకోలేదు.. ప్రస్తుతం దర్శకురాలిగా మరో అడుగు ముందుకేసింది వరలక్ష్మి శరత్ కుమార్. అందులో భాగంగానే తన సొంత నిర్మాణ సంస్థ అయిన దోస డైరీస్ ద్వారా తన చెల్లెలితో కలసి సరస్వతి అనే చిత్రానికి నిర్మాతగా మారడమే కాకుండా ఈ చిత్రానికి దర్శకురాలిగా కూడా పనిచేస్తుంది. అలాగే శక్తి , పంబన్, కుంభ, కన్నమూచి, కూర్మ నాయకి వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది.


Tags:    

Similar News