కృతజ్ఞతే పెట్టుబడిగా... పాత తరం వారసత్వాన్ని మోస్తున్న కొత్త తరం!

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 'సింగ్ గీతం' సినిమాకు నాగ్ అశ్విన్, కమల్ హాసన్, సూర్య అందిస్తున్న సపోర్ట్ దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ..ఆ విశేషాలు మీకోసం..

Update: 2026-06-24 06:45 GMT

ఒకప్పుడు ఏ రంగాన్నైనా శాసించిన సీనియర్లు వయసు పైబడ్డాక తెరమరుగవడం చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. 80 ఏళ్ల వయసులో కూడా సీనియర్లు సరికొత్త ఐడియాలతో వస్తుంటే, నేటి 20, 30 ఏళ్ల యువతరం వారికి అండగా నిలుస్తోంది. పాత తరం 'అనుభవం', కొత్త తరం 'టెక్నాలజీ' కలిసి సమాజంలో సరికొత్త వారసత్వాన్ని సృష్టిస్తున్నాయి. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 'సింగ్ గీతం' సినిమాకు నాగ్ అశ్విన్, కమల్ హాసన్, సూర్య అందిస్తున్న సపోర్ట్ దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ..ఆ విశేషాలు మీకోసం..



 


ట్రెండ్‌కు నిదర్శనం.. 'సింగ్ గీతం':

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రతిష్టాత్మక చిత్రం 'సింగ్ గీతం' ఈ నెల 11న విడుదలై అద్భుతమైన సక్సెస్ సాధించింది. తెలుగులో నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ను వెన్నుతట్టి ముందుకు తీసుకెళ్లగా, ప్రచారంలో పలువురు సెలబ్రిటీలు స్వచ్ఛందంగా భాగమయ్యారు. ఇక జూన్ 26న విడుదల కానున్న తమిళ వెర్షన్‌ కోసం యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వగా, హీరో సూర్య ఈ కంటెంట్‌కునచ్చి AGS సినిమాస్ ద్వారా స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇద్దరు అగ్ర హీరోల అండతో, తమిళనాడులో ఈ సినిమా ఇక్కడికంటే ఇంకా పెద్ద రేంజ్‌లో ఆడుతుందేమో అనే అంచనాలు కనిపిస్తున్నాయి.

వ్యాపారం కాదు... కేవలం కృతజ్ఞత:

సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో లేదా కార్పొరేట్ రంగంలో మార్కెట్ వాల్యూ, లాభాలు చూసి ప్రమోషన్స్ చేస్తుంటారు. కానీ ఈ సరికొత్త ట్రెండ్‌లో యువతరం తమకు మార్గదర్శకులుగా నిలిచిన సీనియర్ల కోసం ఎలాంటి స్వార్థం లేకుండా రంగంలోకి దిగుతోంది. ఇక తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్, నెట్‌వర్కింగ్ స్కిల్స్‌ను ఉపయోగించి ఆ వృద్ధ నిపుణుల ఐడియాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ నడుస్తోంది బిజినెస్ కాదు, కేవలం గురువుల పట్ల "కృతజ్ఞత మరియు గౌరవం" మాత్రమే. ఇక ఈ సినిమా నచ్చి ప్రభాస్,అనిల్ రావిపూడి,కమల్ హాసన్, ఇప్పుడు సూర్య లాంటి వారు ప్రమోట్ చేయటం అంటే అంత పెద్ద డైరెక్టర్ కు వాళ్ళు ఇస్తున్న గౌరవం.

పాత తరం విజన్.. కొత్త తరం సపోర్ట్ :

నేటి స్టార్టప్ కల్చర్‌లో ఐడియాలు ఎంత వేగంగా పుడుతుంటాయో, అంతే వేగంగా మాయమైపోతుంటాయి. ఎందుకంటే వాటి వెనుక 'అనుభవ పఠిమ' తక్కువగా ఉంటోంది. సీనియర్ వ్యక్తి ఎంటర్ అయితే, వారి వద్ద దశాబ్దాల అనుభవం, నేర్చుకున్న పాఠాలు ఉంటాయి. వారికి నేటి తరం టెక్నాలజీ, రీచ్ తోడైతే ఆ ప్రాజెక్టుల సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సింగీతం శ్రీనివాసరావు లాంటి లెజెండ్ ఐడియాస్ ను కొత్త తరం నాగ్ అశ్విన్ లాంటి వారు తమ సపోర్ట్ తో ముందుకు తీసుకెళ్లటం విశేషం..

సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూ, వారికి నేటి యువత డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా అండగా నిలవడం నిజంగా గొప్ప విషయం. ఇది కేవలం ఒక సినిమాకో, ఒక రంగానికో పరిమితం కాకుండా ప్రతి ఇంట్లో, ప్రతి ఆఫీస్‌లోనూ జరగాలి. పెద్దల ఆలోచనలకు పిల్లల చేతులు తోడైతే, సమాజానికి అంతకంటే కావాల్సింది ఏముంది? ఈ సరికొత్త సపోర్ట్ సిస్టమ్ ఇలాగే మున్ముందుకూ సాగాలని కోరుకుందాం..

Tags:    

Similar News