కార్తీ అతిపెద్ద సినిమా.. మంచి టైమ్ లోనే..
కార్తి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన స్పై థ్రిల్లర్ కు కొనసాగింపుగా వస్తున్న సర్దార్ 2 రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు.
కార్తి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన స్పై థ్రిల్లర్ కు కొనసాగింపుగా వస్తున్న సర్దార్ 2 రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 10న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ఒక ఇంటెన్స్ వీడియో గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేశారు. చేతిలో గన్ పట్టుకుని బ్యాక్ గ్రౌండ్ లో భారీ బ్లాస్ట్ జరుగుతుంటే కార్తి ఇస్తున్న లుక్ సినిమా థీమ్ ఏంటో చెప్పకనే చెబుతోంది.
ఒక విధంగా ఈ సినిమా పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ను పట్టేసింది. ఆ టైమ్ లో పోటీగా పెద్ద సినిమాలేమి లేవు. నాని ప్యారడైజ్ కూడా సర్దార్ 2 తరువాతనే రానుంది. దానికి తోడు వినాయకచవితి వీకెండ్ కావడం మేజర్ ప్లస్ పాయింట్. లాంగ్ వీకెండ్ కలిసి వస్తే అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ పరంగా కూడా ఈసారి కార్తీ తన కెరీర్ లో రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.
అయితే ఇది రొటీన్ గా వచ్చే ఒక కమర్షియల్ సీక్వెల్ ఫార్మాట్ లో ఉండదని అర్ధమవుతుంది. మేకర్స్ ఈ స్టోరీని సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ లాగా కూడా డిజైన్ చేశారని టాక్. ఏజెంట్ చంద్రబోస్ బ్యాక్ స్టోరీ గురించి చూపిస్తూనే, అతని కొడుకు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ ఒక గ్లోబల్ టెక్నాలజీ వార్ లో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది డ్యూయల్ ఫ్రేమ్ వర్క్ లో హైలెట్ చేసి కథను నడపబోతున్నారట.
ఈ యాక్షన్ మిషన్ లో స్క్రీన్ ప్రెజెన్స్ ను పెంచడానికి క్యాస్టింగ్ కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. బ్లాక్ డాగర్ అనే ఒక పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో ఎస్.జె. సూర్య ఎంట్రీ ఇవ్వడం ఈ ప్రాజెక్ట్ కు అతి పెద్ద ప్లస్ పాయింట్. రజిషా విజయన్ తో పాటు కొత్తగా మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, యోగిబాబు ఈ సిరీస్ లోకి జాయిన్ అయ్యారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ ప్రాజెక్ట్ ను ఏకంగా పదిహేను నెలల పాటు షూట్ చేశారు.
బ్యాంకాక్, అజర్ బైజాన్, కజకిస్థాన్, లూటన్ లాంటి ఇంటర్నేషనల్ లొకేషన్స్ లో భారీ సెటప్స్ వేసి తెరకెక్కించారు. ఇంతవరకు కార్తి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమా ఇదే కావడం విశేషం. టెక్నికల్ గా కూడా ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఈ సారి టీమ్ ను మార్చేశారు. స్పై యాక్షన్ థీమ్ కు తగ్గట్టుగా హై ఓల్టేజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి మ్యూజిక్ డైరెక్టర్ గా శామ్ సి.ఎస్ ను తీసుకున్నారు. డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ ఈ సారి ఒక గ్లోబల్ స్టాండర్డ్ స్పై యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్నాడని తెలుస్తోంది. అతను చేసే ప్రతి సినిమాలో అందరిని ఆలోచింపజేసేలా ఎలిమెంట్స్ ఉంటాయి. మరి ఈసారి ఎలాంటి పాయింట్స్ ని హైలెట్ చేస్తాడో చూడాలి.