• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామాయణం.. ఐదో రోజు ఈ...

రామాయణం.. ఐదో రోజు ఈ స్పీడ్ ఏంటి!

| రామాయణం బుక్‌మైషోలో గంట వ్యవధిలో 1.31 లక్షల టికెట్లు అమ్ముడై కొత్త రికార్డు సృష్టించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పుష్ప 2, ధురంధర్ 2 గంటవారీ బుకింగ్ రికార్డులను అధిగమించింది. యశ్ రావణుడి పాత్రకు వస్తున్న స్పందన, దీపావళి సెలవులు బుకింగ్స్ పెరగడానికి దోహదపడుతున్నాయి.

By - M Prashanth
Update: 2026-11-09 10:24 GMT

రణబీర్ కపూర్ 'రామాయణం' బాక్సాఫీస్ దగ్గర స్పీడ్ పెంచింది. మొదటి రోజు ఓపెనింగ్స్ విషయంలో కొన్ని అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా, ఇప్పుడు బుకింగ్స్‌లో మాత్రం కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ముఖ్యంగా బుక్‌మైషోలో గంట వ్యవధిలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా 'రామాయణం' నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అల్లు అర్జున్ 'పుష్ప 2', రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' పేర్ల మీద ఉన్న రికార్డులను దాటడం విశేషం.

నవంబర్ 9న దీపావళి సెలవుల నేపథ్యంలో 'రామాయణం' బుకింగ్స్ భారీగా పెరిగాయి. లేటెస్ట్ ట్రేడ్ సమాచారం ప్రకారం ఒక గంటలో దాదాపు 1.31 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. బుక్‌మైషో గంటవారీ బుకింగ్స్‌ను ట్రాక్ చేస్తున్న సంస్థలు కూడా లక్షకు పైగా టికెట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ఇంతకుముందు 'ధురంధర్ 2' గంటకు దాదాపు 1.09 లక్షల టికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, 'పుష్ప 2' కూడా 1.07 లక్షలకు పైగా బుకింగ్స్ సాధించింది.

అయితే ఈ మూడు సినిమాల మధ్య ఓ తేడా ఉంది. 'పుష్ప 2', 'ధురంధర్ 2' సినిమాలకు ముందు భాగాల విజయంతో భారీ అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి. కానీ 'రామాయణం' మొదటి భాగం విడుదలయ్యాక ప్రేక్షకుల రెస్పాన్స్ తో బుకింగ్స్ పెంచుకుంటోంది. ముఖ్యంగా ఐదో రోజు ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడవడం బాక్సాఫీస్ పరంగా మంచి విషయమే. పండగ సెలవులు కూడా సినిమాకు బాగా కలిసొస్తున్నాయి.

ఇక 'రామాయణం'లో యశ్ పోషించిన రావణుడి పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు జటాయువు పోరాటం గురించి ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా నటించగా, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రశంసలు వస్తున్నప్పటికీ కథనం, ఎమోషన్స్ విషయంలో మిక్స్ డ్ అభిప్రాయాలు వచ్చాయి.

నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నమిత్ మల్హోత్రా భారీ స్థాయిలో నిర్మించారు. డీఎన్ఈజీ, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ విజువల్ ఎఫెక్ట్స్‌ పై వర్క్ చేశాయి. హన్స్ జిమ్మర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి రెస్పాన్స్ ఉండగా, ఏఆర్ రెహమాన్ పాటలు ఆశించిన స్థాయిలో హైలైట్ కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.

మరోవైపు గంట వ్యవధిలో అత్యధిక టికెట్లు అమ్ముడవడం, మొత్తం బాక్సాఫీస్ వసూళ్లలో అగ్రస్థానంలో నిలవడం రెండూ వేర్వేరు రికార్డులు. 'పుష్ప 2', 'ధురంధర్ 2' సినిమాలు మొత్తం వసూళ్లలో ఇప్పటికే భారీ బెంచ్‌మార్క్‌లు సెట్ చేశాయి. 'రామాయణం'కు ప్రస్తుతం వస్తున్న బుకింగ్స్ దూకుడు రాబోయే రోజుల్లోనూ కొనసాగితే ఆ సినిమాల కలెక్షన్లకు దగ్గరగా వెళ్ళచ్చనే టాక్ వినిపిస్తోంది.

Tags:    
  • ramayana 
  • ranbirkapoor 
  • yash 
  • bookmyshow 
  • boxoffice 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS