• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిన్నప్పుడు అలా ఉండి ఉంటే...

చిన్నప్పుడు అలా ఉండి ఉంటే బాగుండేది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

| జూనియర్ ఎన్టీఆర్ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అనీష్‌లా ఫిట్‌గా ఉండి ఉంటే బాగుండేదని సరదాగా అన్నారు. సినిమా విడుదల సమయంలో ఇప్పటికీ టెన్షన్‌తో నిద్ర పట్టదని, హిట్, ఫ్లాప్ ప్రభావం మాత్రం తనపై ఒక్కరోజే ఉంటుందని వెల్లడించారు.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-09 07:57 GMT

జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నటన, డ్యాన్స్, ఫైట్స్.. ఇలా ప్రతి విషయంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పాత్ర కోసం ఆయన పడే కష్టం, శరీరాన్ని మార్చుకునే విధానం అభిమానులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న ఇట్లు అర్జున‌ సినిమా ప్రమోషన్లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న అనీష్‌తో కలిసి ఆయన సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా అనీష్ అడిగిన ఓ ప్రశ్నకు తారక్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

'మీ చిన్నప్పటి మీకు ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే ఏమి చెబుతారు?' అని అనీష్ అడిగారు. దీనికి ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. " నీలా నేను కూడా ఫిట్‌గా ఉండి ఉంటే బాగుండేది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

నిజానికి ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో కొద్దిగా లావుగా ఉండేవాడు. అయితే తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా శరీరాన్ని సిద్ధం చేసుకోవడం ఆయన అలవాటుగా మార్చుకున్నారు. దానివల్ల ఇప్పటికి ఎన్నో ప్రశంసలు అనుకుంటున్నారు ఈ హీరో.

ఇక ఇదే ఇంటర్వ్యూలో సినిమా విడుదల సమయంలో తనకు ఎదురయ్యే టెన్షన్ గురించి కూడా ఎన్టీఆర్ మాట్లాడారు. మొదటి సినిమా విడుదలైనప్పుడు మాత్రమే కాదు, ఇప్పటికీ తన సినిమా థియేటర్లలోకి వస్తుందంటే రాత్రి నిద్ర పట్టదని చెప్పారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆ ప్రభావం తనపై ఒక్కరోజు మాత్రమే ఉంటుందని వివరించారు. ఏ విషయాన్నీ ఎక్కువ రోజులు మనసులో పెట్టుకోనని తెలిపారు.



Full View


Tags:    
  • jrntr 
  • ntr 
  • aneesh 
  • itluarjuna 
  • tollywood 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS